Mahindra XUV3XO : టాటా నెక్సాన్, బ్రెజాకి గట్టి పోటీ.. మహీంద్రా XUV3XOపై ఆల్‌టైమ్ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్

మహీంద్రా XUV3XOపై ఆల్‌టైమ్ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్

Update: 2025-12-16 07:56 GMT

Mahindra XUV3XO : ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎంట్రీ-లెవల్ ఎస్‌యూవీ అయిన XUV3XOపై ఈ సంవత్సరంలోనే అత్యంత భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇయర్-ఎండ్ ఆఫర్లలో భాగంగా ఈ కారు కొనుగోలుపై వినియోగదారులు ఏకంగా రూ.80,000 వరకు ఆదా చేసుకునే సువర్ణావకాశం ఉంది. గత నెల నవంబర్‌లో కేవలం రూ.35,000 వరకు మాత్రమే ఉన్న ఈ తగ్గింపు, ఇప్పుడు డిసెంబర్‌లో రెట్టింపు అవ్వడం గమనార్హం. ముఖ్యంగా అత్యధిక డిస్కౌంట్‌ను కంపెనీ XUV3XO AX7 L (పెట్రోల్) వేరియంట్‌పై అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.7,28,300 (ఎక్స్-షోరూమ్) గా ఉండగా ఇది మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి దిగ్గజ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

మహీంద్రా వివిధ వేరియంట్లపై ఆకర్షణీయమైన నగదు తగ్గింపులను ఇస్తోంది. XUV3XO AX7 L (పెట్రోల్) వేరియంట్‌పై గరిష్టంగా రూ.80,000 తగ్గింపు లభిస్తుండగా, MX3 (పెట్రోల్) వేరియంట్‌పై రూ.75,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే AX7 (పెట్రోల్), AX7 L (డీజిల్-MT) వేరియంట్లపై రూ.70,000 డిస్కౌంట్ ఉంది. బేస్ మోడల్స్ అయిన MX2 (డీజిల్-MT), ఇతర MX వేరియంట్లపై కూడా రూ.60,000 వరకు భారీ తగ్గింపును మహీంద్రా ప్రకటించింది. తక్కువ వేరియంట్లలో AX5 వంటి వాటిపై రూ.10,000 నుంచి రూ.20,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో మంచి కారు కోసం చూస్తున్న వారికి ఇది సరైన సమయం.

XUV3XO తన విభాగంలోనే అత్యుత్తమ సేఫ్టీ, అడ్వాన్సుడ్ ఫీచర్లకు పేరుగాంచింది. దీని బేస్ వేరియంట్ MX1 లోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, LED టెయిల్ ల్యాంప్స్, రియర్ AC వెంట్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. MX2 వేరియంట్‌కు వచ్చేసరికి 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అందుబాటులోకి వస్తాయి. ఇక MX2 ప్రో వేరియంట్ ఒక ప్రత్యేక ఆకర్షణ, ఎందుకంటే చాలా తక్కువ ధరలోనే ఇందులో సింగిల్-పాన్ సన్‌రూఫ్ ఫీచర్ లభిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఇంత తక్కువ బడ్జెట్‌లో సన్‌రూఫ్ లభించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

XUV3XO కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా వివిధ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 111hp ఇచ్చే టర్బో-పెట్రోల్, 117hp ఇచ్చే డీజిల్ ఇంజిన్లు మాన్యువల్ (MT), ఆటోమేటిక్ (AT) గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉన్నాయి. MX3, MX3 ప్రో వంటి మిడ్-రేంజ్ వేరియంట్లలో 10.25 అంగుళాల HD టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రో, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో Bi-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రియర్ LED లైట్ బార్ వంటి ప్రీమియం సౌకర్యాలు ఉన్నాయి. రూ.80,000 వరకు తగ్గిన ధరల నేపథ్యంలో ఈ డిసెంబర్ నెలలో XUV3XO కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అవుతుంది.

Tags:    

Similar News