Mahindra: 450 కిమీకు పైగా రేంజ్ ఇచ్చే ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై రూ.2.5 లక్షల భారీ తగ్గింపు..డోంట్ మిస్
రూ.2.5 లక్షల భారీ తగ్గింపు..డోంట్ మిస్
Mahindra: ప్రస్తుత కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజలు అందరూ ఎలక్ట్రిక్ కార్ల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహింద్రా తమ పాపులర్ ఎస్‌యూవీ మోడల్ అయిన ఎక్స్‌యూవీ 400 ఈవీపై భారీ వెసులుబాటు కల్పిస్తోంది. ఈ సెప్టెంబర్ నెలలో ఈ కారును కొనుగోలు చేసే వారికి రూ.2.5 లక్షల వరకు నేరుగా క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉండటంతో కార్ లవర్స్ ఈ ఆఫర్ పట్ల ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ సదుపాయం సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
అందమైన డిజైన్.. అదిరిపోయే ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం ధర తగ్గింపు విషయంలోనే కాకుండా ఆకర్షణీయమైన లుక్ పరంగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీని ముందు భాగంలో ఉన్న క్లోజ్డ్ గ్రిల్ కారుకు మరింత స్పోర్టివ్ లుక్‌ను ఇస్తుంది. అలాగే కాపర్ ఫినిషింగ్ లోగో డిజైన్‌కు కొత్త లుక్ ఇస్తోంది. కారు లోపలికి అడుగుపెడితే అత్యంత విశాలమైన కేబిన్ కనిపిస్తుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇందులో అత్యాధునిక 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమర్చారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం వంటి అనేక ఆధునిక హంగులు ఇందులో ఉన్నాయి.
లాంగ్ డ్రైవ్‌కు చక్కటి ఎంపిక
ఎలక్ట్రిక్ వాహనాలలో అత్యంత కీలకమైన అంశం బ్యాటరీ సామర్థ్యం అలాగే డ్రైవింగ్ రేంజ్. ఈ విషయంలో ఈ వాహనం ప్రయాణికులను పూర్తిగా నిరాశపరచదు. ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న బ్యాటరీ మోడల్ సుమారు 375 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, పెద్ద 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ గల వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 456 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కేవలం 8.3 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే పవర్ దీని సొంతం. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేసుకోవచ్చు.
సేఫ్టీకి పెద్ద పీట
ప్రయాణంలో భద్రత చాలా ముఖ్యం కాబట్టి కంపెనీ ఇందులో ఎన్నో ఆధునిక సేఫ్టీ ఫీచర్లను జోడించింది. ప్రయాణికుల రక్షణ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. రోడ్డు మీద ఎంతో పటిష్టంగా నడిచే ఈ ఎస్‌యూవీ కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ కారు ధరలు సాధారణంగా రూ.15.49 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ.17.69 లక్షల వరకు ఉంటాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారీ డిస్కౌంట్ వల్ల చాలా తక్కువ ధరకే ఈ సరికొత్త కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.