Mahindra : ఇక ప్రత్యర్థులకు నిద్రలేని రాత్రులే.. అల్ట్రా హైటెక్ ఫీచర్లతో వస్తున్న మహీంద్రా కార్స్

అల్ట్రా హైటెక్ ఫీచర్లతో వస్తున్న మహీంద్రా కార్స్

Update: 2025-12-22 10:40 GMT

Mahindra : ఎస్‌యూవీలంటే మనందరికీ గుర్తొచ్చే మొదటి పేరు మహీంద్రా. భారత మార్కెట్‌లో తన పట్టును మరింత బిగించేందుకు మహీంద్రా సరికొత్త ప్లాన్‌తో దూసుకొస్తోంది. తన పాపులర్ మోడళ్లయిన థార్, స్కార్పియో, XUV700లను ఊహించని రేంజ్‌లో అప్‌డేట్ చేస్తూ వాటిని మరింత పవర్‌ఫుల్, హైటెక్‌గా మార్చబోతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన XEV 9Sని విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు ఐసిఈ (పెట్రోల్/డీజిల్) లైనప్‌ను కూడా ప్రక్షాళన చేస్తోంది.

ఈ అప్‌డేట్స్‌లో భాగంగా రాబోతున్న ప్రధాన మార్పుల వివరాలు ఇక్కడ ఉన్నాయి

XUV 7XO: మహీంద్రా XUV700 ఇప్పుడు XUV 7XOగా పేరు మార్చుకుని జనవరిలో లాంచ్ కాబోతోంది. దీని బాహ్య రూపంలో చిన్నపాటి మార్పులు ఉన్నప్పటికీ, అసలైన మ్యాజిక్ లోపల (ఇంటీరియర్) జరగబోతోంది. XEV 9S తరహాలో ఇందులో ఏకంగా మూడు భారీ స్క్రీన్లతో కూడిన సరికొత్త డాష్‌బోర్డ్‌ను రూపొందిస్తున్నారు. డ్రైవర్‌తో పాటు పక్కన కూర్చునే ప్రయాణికుడికి కూడా ప్రత్యేక వినోద స్క్రీన్ ఉండటం విశేషం. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్, కొత్త కలర్ థీమ్స్, అప్‌డేటెడ్ ఫీచర్లతో ఇది లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

థార్ ఈవీ : ప్రతి ఒక్కరి డ్రీమ్ కార్ అయిన థార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో సందడి చేసేందుకు సిద్ధమైంది. విజన్ టి కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఈ థార్ ఈవీ, 5-డోర్ల థార్ రాక్స్ ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది మహీంద్రా అత్యాధునిక NU_IQ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో పాటు, ఆఫ్-రోడింగ్ కోసం డ్యూయల్-మోటర్ (4WD) సౌకర్యం కూడా ఉండబోతోంది. 2026 నాటికి ఇది రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

స్కార్పియో ఎన్ : మహీంద్రా తన స్కార్పియో శ్రేణిని కూడా పూర్తిగా మార్చేస్తోంది. భవిష్యత్తులో వచ్చే స్కార్పియో మోడళ్లు ప్రస్తుత లాడర్-ఫ్రేమ్ డిజైన్ కాకుండా, మరింత ఆధునికమైన మోనోకాక్ ప్లాట్‌ఫారమ్ అయిన NU_IQ పై రాబోతున్నాయి. దీనివల్ల కారు మరింత సేఫ్టీగా, వేగంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఉన్న స్కార్పియో ఎన్‌కు త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ రానుంది. ఇందులో పనోరమిక్ సన్ రూఫ్, 12.3 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లను జోడించబోతున్నారు.

మొత్తానికి, మహీంద్రా తన ఐకానిక్ బ్రాండ్‌లను మరింత పవర్‌ఫుల్ ఇంజన్లు, అత్యాధునిక టెక్నాలజీతో మల్టీపర్పస్ వెహికల్స్‌గా మారుస్తోంది. కేవలం రఫ్ అండ్ టఫ్ లుక్ మాత్రమే కాదు, లగ్జరీ, ఫీచర్లలో కూడా తనదే పైచేయి అని నిరూపించుకోబోతోంది.

Tags:    

Similar News