Maruti Suzuki Celerio : ఆల్టో k10 వద్దనుకునే వాళ్లకు బెస్ట్ ఛాయిస్.. ఈ కారు పై రూ.94000 తగ్గింపు
ఈ కారు పై రూ.94000 తగ్గింపు
Maruti Suzuki Celerio : పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి తమ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు సెలెరియో ధరలను భారీగా తగ్గించింది. ఎంట్రీ-లెవల్ ఆల్టో కె10 కారును కొనడానికి ఇష్టపడని కస్టమర్‌ల కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇటీవల జరిగిన జీఎస్టీ తగ్గింపుల తర్వాత సెలెరియో ధరలు మరింత చవకగా మారాయి. ఈ తగ్గింపుతో రాబోయే నెలల్లో తమ మొత్తం అమ్మకాలు పెరుగుతాయని మారుతి సుజుకి అంచనా వేస్తోంది.
మారుతి సుజుకి సెలెరియో ధరలో వేరియంట్‌ను బట్టి రూ.59,000 నుంచి గరిష్టంగా రూ.94,000 వరకు తగ్గింపు లభించింది. జీఎస్టీ రేట్ల మార్పు తర్వాత బేస్ వేరియంట్ LXi ధరలో అత్యధికంగా రూ.94,000 తగ్గింపు వచ్చింది. అదే సమయంలో, ZXi ప్లస్ MT వేరియంట్ ధరలో అత్యల్పంగా రూ.59,000 తగ్గింపు లభించింది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న వేరియంట్ల ధరలు రూ.59,000 నుంచి రూ.94,000 వరకు తగ్గాయి. ఆటోమేటెడ్ మ్యానువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ల ధరలు ట్రిమ్ ఆప్షన్‌ను బట్టి రూ.66,000 నుంచి రూ.89,000 వరకు తగ్గాయి.
మారుతి సుజుకి కొన్నేళ్ల క్రితం సెలెరియోను సరికొత్త డిజైన్, పలు అదనపు ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఇది ఇప్పుడు ట్రెండీ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సెలెరియో అనేక ఎక్స్-టీరియర్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి స్పీడీ బ్లూ, గ్లిస్టినింగ్ గ్రే, ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్, సాలిడ్ ఫైర్ రెడ్, కాఫీన్ బ్రౌన్, పెర్ల్ బ్లూయిష్ బ్లాక్.
సెలెరియో మెయిన్ అట్రాక్షన్ దాని మైలేజ్. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ కొన్ని ఎంచుకున్న వేరియంట్లలో CNG కిట్‌తో కూడా లభిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ లీటర్‌కు 25.24 కి.మీ నుంచి 26.68 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఇక CNG వెర్షన్ అయితే కిలోగ్రామ్‌కు ఏకంగా 34.43 కి.మీ వరకు మైలేజీని ఇవ్వడం ద్వారా మైలేజ్ కింగ్ గా నిలుస్తుంది. ఈ భారీ ధర తగ్గింపు కారు కొనుగోలుదారులకు పండుగ సీజన్‌లో ఒక పెద్ద బహుమతి అని చెప్పవచ్చు.