Maruti e-Vitara : మారుతి సుజుకి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. ఆగస్టు 26న ఈ-విటారా ఉత్పత్తి ప్రారంభం

ఆగస్టు 26న ఈ-విటారా ఉత్పత్తి ప్రారంభం;

Update: 2025-08-16 06:17 GMT

Maruti e-Vitara : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఈ పోటీలోకి దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి కూడా అడుగుపెట్టబోతోంది. తన తొలి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా ఉత్పత్తిని ఆగస్టు 26, 2025 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ-విటారా లాంచ్ అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న టాటా నెక్సాన్ ఈవీతో పాటు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మారుతి సుజుకి ఈ-విటారాను స్టైలిష్ డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో రూపొందించింది. దీని ముందు భాగంలో వై-ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి దీనికి రేడియేటర్ గ్రిల్ అవసరం లేదు. సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ క్లాడింగ్, 18-అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో నలుపు బంపర్, మూడు భాగాల ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఈ-విటారా లోపలి భాగంలో డ్యూయల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ ఉంది. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. దీనితో పాటుగా, డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, సెమీ-లెదరెట్ సీటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీటును పది రకాలుగా అడ్జస్ట్ చేసుకునే సదుపాయం ఉంది. సేఫ్టీ విషయంలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి ఫీచర్లు ఉన్నాయి.

యూకే మార్కెట్ మోడల్ ప్రకారం, ఈ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 49 kWh, 61 kWh. 49 kWh బ్యాటరీ 344 కి.మీ.ల WLTP రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో ఫ్రంట్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది 142 బీహెచ్‌పీ పవర్, 193 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 61 kWh బ్యాటరీ ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ 426 కి.మీ.ల రేంజ్, 171 బీహెచ్‌పీ పవర్, 193 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ 395 కి.మీ.ల రేంజ్, 181 బీహెచ్‌పీ పవర్, 307 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

49 kWh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 7 kW ఏసీ ఛార్జర్‌తో 10% నుంచి 100% వరకు 6.5 గంటల టైం పడుతుంది. 11 kW ఛార్జర్‌తో 4.5 గంటలు పడుతుంది. 61 kWh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 7 kW ఏసీ ఛార్జర్‌తో సుమారు 9 గంటలు సమయం పడుతుంది. 11 kW ఛార్జర్‌తో 5.5 గంటలు పడుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో రెండు బ్యాటరీ ప్యాక్‌లు 45 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ అవుతాయి.

Tags:    

Similar News