Maruti Suzuki : మారుతి కారు ఉన్న వాళ్లకు అలర్ట్.. వెంటనే షోరూంలకు తీసుకెళ్లండి

వెంటనే షోరూంలకు తీసుకెళ్లండి

Update: 2025-11-15 11:59 GMT

Maruti Suzuki : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తమ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో పెద్ద లోపం కారణంగా వాహనాలను వెనక్కి పిలుస్తున్నట్లు (రీకాల్) ప్రకటించింది. మొత్తం 39,506 యూనిట్లలో స్పీడోమీటర్ అసెంబ్లీలో ఉన్న ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్ లో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. దీని కారణంగా కారులో ఇంధనం ఎంత ఉందో సరిగ్గా తెలియక, వాహనం అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది.

డిసెంబర్ 9, 2024 నుంచి ఏప్రిల్ 29, 2025 మధ్య తయారైన మొత్తం 39,506 గ్రాండ్ విటారా యూనిట్లను మారుతి సుజుకి వెనక్కి పిలిచింది. ఈ వాహనాల్లోని స్పీడోమీటర్ అసెంబ్లీలో అమర్చిన ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సరిగా పనిచేయడం లేదని కంపెనీ అనుమానిస్తోంది. ఈ లోపం కారణంగా కారులో ఇంధనం ఎంత ఉందో డ్రైవర్లకు తప్పుడు సమాచారం చూపిస్తుంది. ఫ్యూయల్ ఇండికేటర్ తప్పుడు సమాచారం చూపించడం వల్ల, వాహనంలో ఇంధనం ఉన్నట్లు కనిపిస్తున్నా, అది అకస్మాత్తుగా అయిపోయి రోడ్డుపై ఆగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హైవేలు లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్య అవుతుంది.

ఈ సమస్యను పరిష్కరించడానికి మారుతి సుజుకి కంపెనీ ప్రభావితమైన వాహనదారులను నేరుగా సంప్రదిస్తుంది. వాహనదారులు తమ కారును ఏదైనా అధీకృత మారుతి సుజుకి వర్క్‌షాప్‌కు తీసుకెళ్లవచ్చు. అక్కడ లోపభూయిష్టమైన స్పీడోమీటర్ అసెంబ్లీని ఉచితంగా పరిశీలించి, మార్చి ఇస్తారు. ఈ మరమ్మతు ప్రక్రియకు కంపెనీ ఎలాంటి అదనపు ఖర్చు వసూలు చేయదని స్పష్టం చేసింది. వాహనదారులు మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తమ VIN (Vehicle Identification Number) ను ఎంటర్ చేసి, తమ వాహనం రికాల్ పరిధిలోకి వస్తుందో లేదో తెలుసుకోవచ్చు.

మార్కెట్‌లో గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

మైల్డ్-హైబ్రిడ్ : 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్.

స్ట్రాంగ్-హైబ్రిడ్ : 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది ఎలక్ట్రిక్ మోటారుతో అనుసంధానం చేయబడింది. మారుతి క్లెయిమ్ ప్రకారం, గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హ్యాబ్రిడ్ వెర్షన్ 27.97 కి.మీ/లీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది.

Tags:    

Similar News