Upcoming SUVs : క్రెటాకు రెండు వైపులా పోటీ.. మారుతి, టాటా నుంచి అదిరిపోయే కార్లు

మారుతి, టాటా నుంచి అదిరిపోయే కార్లు;

Update: 2025-08-22 10:29 GMT

Upcoming SUVs : హుంద్యాయ్ క్రెటా జూలై 2025లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచి, మారుతి బ్రెజా, టాటా నెక్సాన్‌ను వెనక్కి నెట్టేసింది. చాలా నెలలుగా క్రెటా అమ్మకాలు అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పుడు క్రెటాకు గట్టి పోటీ ఇవ్వడానికి మారుతి సుజుకి, టాటా మోటార్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని రెండు కొత్త కార్లను లాంచ్ చేయబోతున్నాయి. అవి నేరుగా క్రెటాకు పోటీ ఇవ్వనున్నాయి.

మారుతి సుజుకి ఎస్కుడో, టాటా సియెరా

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి ఎస్కుడో, టాటా మోటార్స్ కొత్త సియెరాను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. మారుతి ఎస్కుడో ధర ఆగస్టు 24న ప్రకటించనున్నారు. అయితే టాటా సియెరా అక్టోబర్ లేదా నవంబర్ 2025 నాటికి షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

టాటా సియెరా

టాటా సియెరా ఈ సంవత్సరం అత్యంత ఎక్కువగా ఎదురుచూస్తున్న కొత్త ఎస్‌యూవీలలో ఒకటి. మొదట్లో ఈ మోడల్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్‌లో తీసుకురానున్నారు. ఇందులో హారియర్ ఈవీలో ఉన్న ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లు వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అవుతాయి. సియెరా పెట్రోల్ వెర్షన్‌లో సరికొత్త 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది తక్కువ ధరలో ఈ కారును అందించడానికి టాటాకు సహాయపడుతుంది. తర్వాత, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఈ లైనప్‌లో చేర్చే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎస్కుడో

మారుతి సుజుకి సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయబోతోంది. దీనికి ప్రస్తుతం మారుతి ఎస్కుడో అని పేరు పెట్టారు.. కానీ తరువాత పేరు మారవచ్చు. ఇది మారుతి ఎరీనా పోర్ట్‌ఫోలియోలో కొత్త మోడల్. ఇందులో గ్రాండ్ విటారాలో ఉన్న ఫీచర్లు చాలా వరకు ఉంటాయి, కానీ ధర తక్కువగా ఉంటుంది. ఈ కారులో లెవెల్-2 ఏడీఏఎస్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్‌గేట్, 4డబ్ల్యుడీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. అండర్‌బాడీ సీఎన్‌జీ కిట్‌ను అందించే మొదటి మారుతి సుజుకి కారు కూడా ఇదే అవుతుందని నివేదికలు చెబుతున్నాయి.

Tags:    

Similar News