Maruti Wagon R: కేవలం రూ.4.99 లక్షలకే 34 కిమీ మైలేజ్.. స్విఫ్ట్‌ను వెనక్కి నెట్టిన వ్యాగన్ ఆర్
స్విఫ్ట్‌ను వెనక్కి నెట్టిన వ్యాగన్ ఆర్
Maruti Wagon R: భారత హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ తన ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటోంది. సెప్టెంబర్ 2026 విక్రయాల లెక్కల ప్రకారం వ్యాగన్ ఆర్ మరోసారి అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది. ఓవర్‌ఆల్ కార్ సేల్స్‌లో 5వ స్థానంలో ఉన్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తమ సొంత కంపెనీకి చెందిన మారుతి స్విఫ్ట్‌ను దాటేసింది. సెప్టెంబర్ నెలలో వ్యాగన్ ఆర్ ఏకంగా 18,835 యూనిట్ల విక్రయాలు నమోదు చేసి, గత ఏడాదితో పోలిస్తే 22 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.
రూ. 4.99 లక్షల ధర, అద్భుత మైలేజ్
మారుతి వ్యాగన్ ఆర్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షలుగా ఉంది. ఇందులో 1.0-లీటర్ త్రీ-సిలిండర్, 1.2-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వచ్చే ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 24 నుంచి 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక సిఎన్‌జి వెర్షన్ విషయానికొస్తే కేజీ సిఎన్‌జీకి ఏకంగా 34 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తూ వాహనదారులకు భారీగా ఇంధన పొదుపును అందిస్తోంది.
ఆకట్టుకునే ఇంటీరియర్, 6 ఎయిర్‌బ్యాగ్స్ సేఫ్టీ
కారు కేబిన్‌లో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లౌడ్ ఆధారిత సేవలు, నాలుగు స్పీకర్లు, మౌంటెడ్ కంట్రోల్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎక్కువ హెడ్‌రూమ్‌తో కూడిన బాక్సీ డిజైన్ వల్ల ప్రయాణం ఎంతో హాయిగా ఉంటుంది.
మార్కెట్లోకి త్వరలోనే వ్యాగన్ ఆర్ ఫేస్‌లిఫ్ట్
వినియోగదారులను మరింత ఆకట్టుకోవడానికి మారుతి సంస్థ వ్యాగన్ ఆర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త మోడల్ టెస్టింగ్ ఇప్పటికే నగరాల్లో జోరుగా సాగుతోంది. ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌లో సరికొత్త హెడ్‌లాంప్‌లు, అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్ కనిపించనున్నాయి. క్లాసిక్ టాల్-బోయ్ బాక్సీ లుక్‌ను అలాగే ఉంచుతూ డిజైన్‌లో కొన్ని మార్పులు చేసారు.
అండర్‌బాడీ సిఎన్‌జి ట్యాంక్, కొత్త ఇంజిన్
కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 1.2-లీటర్ కే12ఎన్ ఇంజిన్ స్థానంలో కొత్త స్విఫ్ట్, డిజైర్, బలేనో కార్లలో వాడిన Z12E 1.2-లీటర్ త్రీ-సిలిండర్ ఇంజిన్‌ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు అత్యంత ముఖ్యమైన మార్పు ఏంటంటే, సిఎన్‌జి ట్యాంక్‌ను కారు అడుగు భాగంలో (అండర్‌బాడీ) అమర్చనున్నారు. దీనివల్ల బూట్ స్పేస్ సమస్య పూర్తిగా తొలిగిపోయి లగేజ్ పెట్టుకోవడానికి ఎక్కువ జాగ లభిస్తుంది.