Maruti Suzuki: మారుతి మాస్టర్ ప్లాన్..ఆఫ్-రోడింగ్ కింగ్ పై రూ.2 లక్షల డిస్కౌంట్..ఎగబడి కొంటున్న జనం

ఆఫ్-రోడింగ్ కింగ్ పై రూ.2 లక్షల డిస్కౌంట్..ఎగబడి కొంటున్న జనం

Update: 2026-01-07 05:22 GMT

Maruti Suzuki: కొత్త సంవత్సరం 2026లో కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి తీపి కబురు అందించింది. జనవరి నెల ఆఫర్లలో భాగంగా తన లైఫ్ స్టైల్ SUV జిమ్నీ పై భారీగా ధర తగ్గించింది. ఏకంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆఫర్ అన్ని డీలర్‌షిప్‌ల దగ్గర స్టాక్ ఉన్నంత వరకే అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా జిమ్నీలోని థండర్ ఎడిషన్ లేదా ఆల్ఫా వేరియంట్ కొనుగోలు చేసే వారికి ఈ భారీ ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా జిమ్నీ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.32 లక్షల నుండి రూ.14.45 లక్షల మధ్య ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ డిస్కౌంట్‌తో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.

మారుతి జిమ్నీలో పవర్‌ఫుల్ 1.5-లీటర్ ఫోర్-సిలిండర్ K15B మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 105 hp పవర్, 134 Nm టార్క్‌ను అందిస్తుంది. అడ్వెంచర్ ప్రియుల కోసం ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. కొండలు, గుట్టల్లో ప్రయాణించే వారికి ఈ కారు ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs, టీఎఫ్టీ కలర్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

జిమ్నీ లోపల వెళ్తే లగ్జరీకి తక్కువేం లేదు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ బేస్ వేరియంట్‌లో ఉంటే, టాప్ వేరియంట్ అయిన ఆల్ఫా లో 9-అంగుళాల భారీ స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి తోడు అర్కామిస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు ప్రయాణాన్ని బోర్ కొట్టనివ్వవు. బయటి వైపు ఎల్ఈడి ఆటో హెడ్ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ కారుకు మంచి లుక్ ఇస్తాయి.

ప్రయాణికుల భద్రత విషయంలో మారుతి ఎక్కడా రాజీ పడలేదు. ఈ కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు. ఇవే కాకుండా బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ (LSD), ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి ఫీచర్లు ఉన్నాయి. కొండల మీద కారు వెనక్కి జారకుండా ఉండేందుకు హిల్ హోల్డ్ కంట్రోల్, దిగేటప్పుడు కంట్రోల్ తప్పకుండా హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి అద్భుతమైన టెక్నాలజీని కూడా ఇందులో జోడించారు.

Tags:    

Similar News