Dzire vs Amaze : మారుతి డిజైర్ వర్సెస్ హోండా అమేజ్.. మధ్యతరగతికి ఏ కారు బెస్ట్?

మధ్యతరగతికి ఏ కారు బెస్ట్?

Update: 2026-03-13 10:09 GMT

 Dzire vs Amaze : భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవానే నడుస్తోంది. కానీ, మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పటికీ కాంపాక్ట్ సెడాన్ కార్లంటేనే ప్రాణం. ముఖ్యంగా మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ మధ్య జరిగే పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. సామాన్య వాహనదారులే కాకుండా, ట్యాక్సీ డ్రైవర్లు, ఫ్లీట్ ఆపరేటర్లు కూడా ఈ రెండు కార్లనే ఎక్కువగా నమ్ముతుంటారు. అందుకే మార్కెట్లో ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా, ఈ రెండు సెడాన్ల అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు.

తాజాగా మారుతి, హోండా సంస్థలు ఈ రెండు కార్లను సరికొత్త హంగులతో మార్కెట్లోకి విడుదల చేశాయి. కొత్త డిజైన్ మాత్రమే కాకుండా, అత్యాధునిక ఫీచర్లను కూడా జోడించాయి. మారుతి డిజైర్ విషయానికొస్తే, ఇందులో కొత్తగా 1.2 లీటర్ల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది అదిరిపోయే మైలేజీతో పాటు చాలా స్మూత్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇక హోండా అమేజ్ కూడా తగ్గేదేలే అంటోంది. ఇందులో ఎప్పటి నుంచో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన 1.2 లీటర్ల ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగిస్తున్నారు. హోండా ఇంజిన్ పర్ఫార్మెన్స్‌కు కస్టమర్లలో ఉండే క్రేజ్ వేరు.

ధర విషయానికి వస్తే మారుతి డిజైర్ కాస్త తక్కువ బడ్జెట్‌లో దొరుకుతుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.6.25 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ.9.31 లక్షల వరకు ఉంటుంది. అదే హోండా అమేజ్ కొనాలంటే జేబు కాస్త ఎక్కువగానే ఖాళీ చేయాలి. దీని ధర రూ.7.48 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ.10 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు చేరుతుంది. మీరు బడ్జెట్‌ను బట్టి కార్లు కొనాలనుకుంటే డిజైర్ బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది, కానీ లగ్జరీ, బ్రాండ్ వాల్యూ కోరుకునే వారు అమేజ్ వైపు మొగ్గు చూపుతారు.

మీరు వీటిలో టాప్ వేరియంట్లను ఈఎంఐ ద్వారా కొనాలనుకుంటే ఆ లెక్కలు ఇలా ఉంటాయి. మారుతి డిజైర్ టాప్ మోడల్ (ZXI+ AMT) కోసం 9.5 శాతం వడ్డీతో రెండేళ్ల పాటు లోన్ తీసుకుంటే నెలకు సుమారు రూ.42,760 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అదే హోండా అమేజ్ టాప్ మోడల్ (ZX CVT) కోసం నెలకు రూ.45,910 ఈఎంఐ పడుతుంది. ఒకవేళ మీరు లోన్ కాలాన్ని మూడేళ్లకు పెంచుకుంటే, డిజైర్‌కు రూ.29,832, అమేజ్‌కు రూ.32,030 వరకు నెలవారీ ఈఎంఐలు వస్తాయి.

ఈ లెక్కలన్నీ ఎక్స్‌షోరూమ్ ధరపై 100 శాతం లోన్ తీసుకున్నట్లు ఊహించి చేసినవి. కానీ నిజానికి మీరు కట్టే డౌన్ పేమెంట్, మీకు బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటును బట్టి ఈ ఈఎంఐలు మారుతుంటాయి. ఈ రెండు కార్లు కూడా తమదైన ప్రత్యేకతలతో భారత మార్కెట్లో పోటీ పడుతున్నాయి. మైలేజీ ముఖ్యం అనుకుంటే డిజైర్, లేదు మాకు మంచి బిల్డ్ క్వాలిటీ, స్మూత్ ఇంజిన్ కావాలనుకుంటే అమేజ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Tags:    

Similar News