New Kia Seltos : కొత్త అవతారంలో కియా సెల్టోస్..టాటా సియెరా, హ్యుందాయ్ క్రెటాలకు చుక్కలే

టాటా సియెరా, హ్యుందాయ్ క్రెటాలకు చుక్కలే

Update: 2025-12-11 07:52 GMT

New Kia Seltos : భారతదేశంలో కియా సంస్థ తన ప్రసిద్ధ ఎస్‌యూవీలతో పేరు సంపాదించింది. ఇప్పుడు కంపెనీ తన ప్రముఖ ఎస్‌యూవీ సెల్టోస్ న్యూ జనరేషన్ మోడల్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త సెల్టోస్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా ఎక్కువ ఫీచర్లు, మరింత శక్తివంతంగా తయారైంది. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు ప్రతి భాగంలో చేసిన పెద్ద మార్పులు, మీడియం రేంజ్ ఎస్‌యూవీల విభాగంలో దీనిని మళ్లీ బలమైన పోటీదారుగా నిలబెడుతున్నాయి.

కొత్త తరం కియా సెల్టోస్‌కు బయట, లోపల కూడా కొత్తగా రీ డిజైన్ చేశారు. దీని డిజిటల్ టైగర్ ఫేస్ లుక్, స్టార్ మ్యాప్ ఎల్‌ఈడీ లైట్లు ఈ వాహనాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. అదనపు మెటల్ యాక్సెంట్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ బాడీ లైన్లు రోడ్డుపై దీని ఉనికిని మరింత మెరుగుపరుస్తాయి.

కొత్త ప్లాట్‌ఫామ్: న్యూ సెల్టోస్ ఇప్పుడు కంపెనీ యొక్క గ్లోబల్ K3 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ కారు యొక్క బలం, డ్రైవింగ్ స్టెబిలిటీ మరియు భద్రతను పాత మోడల్ కంటే మెరుగ్గా చేస్తుంది. ఇందులో కొత్త బంపర్, అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్ మరియు షార్ప్ లైటింగ్ సెటప్ కూడా ఇచ్చారు.

కొత్త సెల్టోస్‌లో అతిపెద్ద అప్‌డేట్ దాని టెక్నాలజీ-లోడెడ్ క్యాబిన్. ఇందులో 30-అంగుళాల ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లేను అందించారు. దీనితో పాటు ఎస్‌యూవీలో వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, 10-వే పవర్ డ్రైవర్ సీటు, 64-కలర్ యాంబియంట్ లైట్, బోస్ 8 స్పీకర్లు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

సేఫ్టీ కోసం లెవెల్-2 ఏడీఏఎస్, 21 సేఫ్టీ ఫీచర్లు, ఏబీఎస్, ఈబీడీ, ఐసోఫిక్స్, చైల్డ్ సీట్ యాంకరింగ్ వంటివి కూడా లభిస్తాయి. కొత్త కియా సెల్టోస్ పాత మోడల్ కంటే మరింత విశాలంగా మారింది. దీని పొడవు 4,460 మి.మీ, వెడల్పు 1,830 మి.మీ. దీని వీల్‌బేస్ 2,690 మి.మీ, ఇది పాత మోడల్ కంటే 90 మి.మీ ఎక్కువ. పెరిగిన వీల్‌బేస్ కారణంగా కేబిన్ స్పేస్, లెగ్‌రూమ్, స్టోరేజ్ మెరుగయ్యాయి.

కొత్త కియా సెల్టోస్‌లో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఇచ్చారు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 115 PS పవర్, 144 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 PS పవర్, 253 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది అత్యంత పవర్ఫుల్ ఆప్షన్. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116 PS పవర్, 250 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కొత్త సెల్టోస్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, దీని ధరలను జనవరి 2026 లో ప్రకటిస్తారు. ధరలు ప్రకటించిన వెంటనే డెలివరీలు కూడా మొదలవుతాయి. భారతీయ మార్కెట్‌లో ఇది హ్యుందాయ్ క్రెటా, టాటా కర్వ్, టాటా సియెరా, టాటా హారియర్, ఎంజీ హెక్టార్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలతో గట్టిగా పోటీ పడనుంది. ప్రీమియం ఫీచర్లు, ADAS టెక్నాలజీతో సెల్టోస్, క్రెటా, సియెరాలకు కఠినమైన సవాలును విసిరే అవకాశం ఉంది.

Tags:    

Similar News