Electric Vehicles : బ్యాటరీ భయం అక్కర్లేదు.. ఏళ్ల తరబడి వచ్చే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే
ఏళ్ల తరబడి వచ్చే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే;
Electric Vehicles : భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా టూ-వీలర్ విభాగంలో. ఖరీదైన పెట్రోల్ ధరల నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నగరాల్లో ఇప్పుడు ఎక్కువగా ఈవీ స్కూటర్లే కనిపిస్తున్నాయి. అయితే కస్టమర్లలో ఎప్పుడూ స్కూటర్ బ్యాటరీ ఎంత కాలం పనిచేస్తుంది. దానిపై ఎంత కాలం వారంటీ ఉంటుంది లాంటి ప్రశ్నలు ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు బ్యాటరీ పర్ఫామెన్స్, వారంటీ చాలా ముఖ్యమైన అంశాలు... బ్యాటరీ త్వరగా పాడైపోతే ఏమవుతుందో దానిని మార్చడానికి ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని చాలా మంది కస్టమర్లు ఆందోళన చెందుతుంటారు. అలాంటి సందర్భంలో సరైన సమాచారం తెలుసుకుని, తెలివిగా స్కూటర్‌ను సెలక్ట్ చేసుకోవడం మంచిది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ముఖ్యంగా దాని S1 సిరీస్ భారత మార్కెట్‌లో విపరీతంగా పాపులర్ అయ్యింది. దీని అతిపెద్ద ప్రత్యేకత, దాని బ్యాటరీపై లభించే బలమైన వారంటీ. ఓలా తన స్కూటర్లపై స్టాండర్డ్ గా మూడేళ్లు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. అయితే, ఇది అక్కడితో ఆగదు. కస్టమర్లు కోరుకుంటే ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీ ద్వారా దీనిని 8ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు పొడిగించుకోవచ్చు. ఈ కారణంగానే ఓలా స్కూటర్ బ్యాటరీ విషయంలో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించగలిగింది. S1 ధర రూ.99,999(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
2. ఏథర్ ఎనర్జీ స్కూటర్
ఏథర్ ఎనర్జీ భారత ప్రీమియం ఈవీ స్కూటర్ బ్రాండ్లలో ఒకటి. దీని స్కూటర్లు టెక్నాలజీ, డిజైన్, పర్ఫామెన్స్ కు పేరుగాంచాయి. ఏథర్ తన స్కూటర్లపై మూడేళ్లు లేదా 30,000 కిలోమీటర్ల స్టాండర్డ్ బ్యాటరీ వారంటీని అందిస్తుంది. అయితే, కంపెనీ ప్రో ప్యాక్ అనే వారంటీ ఎక్స్‌టెన్షన్ ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. దీని కింద కస్టమర్లకు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారంటీ లభిస్తుంది. ఈ కాలం తర్వాత కూడా బ్యాటరీ సామర్థ్యం దాదాపు 70 శాతం వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
3. సింపుల్ ఎనర్జీ స్కూటర్
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ కూడా ఈవీ మార్కెట్‌లో తనదైన ముద్ర వేయడం ప్రారంభించింది. ఈ కంపెనీ స్కూటర్లు తమ హై రేంజ్, శక్తివంతమైన ఫీచర్లకు ప్రసిద్ధి. సింపుల్ ఎనర్జీ తన స్కూటర్లపై 8 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తుంది, ఇందులో బ్యాటరీ, మోటార్ రెండూ కూడా ఉంటాయి. ఈ కంపెనీ ఇప్పుడు నమ్మకమైన ఈవీ బ్రాండ్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది.