Renault Bridger : డిఫెండర్ లుక్.. అదిరిపోయే పవర్.. రెనాల్ట్ నుంచి ‘బ్రిడ్జర్’ ఎస్‌యూవీ వచ్చేస్తోంది!

రెనాల్ట్ నుంచి ‘బ్రిడ్జర్’ ఎస్‌యూవీ వచ్చేస్తోంది!

Update: 2026-03-09 08:48 GMT

Renault Bridger : భారతదేశపు ఎస్‌యూవీ ప్రియులకు ఒక అదిరిపోయే వార్త. ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్, తన సరికొత్త కాన్సెప్ట్ ఎస్‌యూవీ రెనాల్ట్ బ్రిడ్జర్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 10, 2026న ఈ కారు వరల్డ్ ప్రీమియర్ జరగనుంది. ఇప్పటికే కంపెనీ విడుదల చేసిన చిన్న టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ కారు లుక్ చూస్తుంటే లగ్జరీ ఆఫ్-రోడర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ను తలపిస్తోంది. పక్కా దేశీ మేధస్సుతో, మన దేశంలోనే తయారవుతున్న ఈ కారు విశేషాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

రెనాల్ట్ బ్రిడ్జర్ టీజర్ చూస్తుంటే ఇది ఒక పక్కా రఫ్ అండ్ టఫ్ ఆఫ్-రోడర్ అని అర్థమవుతోంది. దీని బాక్సీ లుక్, స్ట్రెయిట్ లైన్స్ కారుకు ఒక గంభీరమైన రూపాన్ని ఇచ్చాయి. కారు చుట్టూ ఉన్న దట్టమైన బ్లాక్ క్లాడింగ్, వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు దీనిని ఒక పర్వతాలను కూడా అధిగమించే వాహనంలా చూపిస్తున్నాయి. కారు వెనుక భాగంలో టెయిల్‌గేట్‌కు అమర్చిన స్పేర్ టైర్ దీనికి పక్కా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ లుక్ ఇచ్చింది. బ్లాక్ రూఫ్ రెయిల్స్, సైడ్ స్టెప్స్ వంటి ఫీచర్లు కారుకు మరింత స్టైల్‌ను జోడించాయి.

ఇంజన్ పవర్, ఫీచర్లు

రెనాల్ట్ బ్రిడ్జర్‌లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనాల్ట్ కైగర్ ఇంజన్‌నే వాడే అవకాశం ఉంది. అంటే ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది దాదాపు 100 BHP పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ కారును ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) ఆప్షన్‌తో కూడా లాంచ్ చేయవచ్చని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, మారుతి జిమ్నీ, మహీంద్రా థార్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం.

ధర, లాంచ్ వివరాలు

రెనాల్ట్ బ్రిడ్జర్ మరో గొప్ప విషయం ఏంటంటే, దీనిని పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేస్తున్నారు. చెన్నైలోని రెనాల్ట్ తయారీ కేంద్రంలోనే దీని ప్రొడక్షన్ జరగనుంది. 2027 నాటికి ఈ కారు పూర్తిస్థాయిలో రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే, దీని బేస్ మోడల్ సుమారు రూ.10 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. తక్కువ ధరలో లగ్జరీ లుక్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కావాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటిది.

Tags:    

Similar News