Royal Enfield Bullet 650 vs BSA Goldstar 650 : బుల్లెట్ 650 vs BSA గోల్డ్‌స్టార్ 650 – అసలైన బాద్ షా ఎవరు? ఇంజిన్ తేడాలివే ?
అసలైన బాద్ షా ఎవరు? ఇంజిన్ తేడాలివే ?
Royal Enfield Bullet 650 vs BSA Goldstar 650 : భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో 650సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ సెగ్మెంట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి కొత్త మోడల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్‌ను EICMA 2025 ఈవెంట్‌లో పరిచయం చేసిన తర్వాత, ఇటీవల మళ్లీ మోటోవర్స్ 2025లో ప్రదర్శించారు. భారతీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బుల్లెట్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ కొత్త 650సీసీ మోడల్ రానుంది. ఇది జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
బుల్లెట్ 650కి గట్టి పోటీ ఇస్తున్న BSA గోల్డ్‌స్టార్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ మోటార్‌సైకిళ్ల తయారీలో అనుభవం ఉన్నప్పటికీ బుల్లెట్ 650కి మార్కెట్లో గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ బైక్‌కు ప్రధాన ప్రత్యర్థులలో ఒకటి BSA గోల్డ్‌స్టార్ 650. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోతున్న బుల్లెట్ 650, ఇప్పటికే మార్కెట్లో ఉన్న BSA గోల్డ్‌స్టార్ 650 ఇంజిన్ సామర్థ్యం, ఇతర అంశాలలో తేడాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇంజిన్ పవర్, టార్క్ పోలిక
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లో 648 సీసీ ఎయిర్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది 7,250 ఆర్‌పీఎం వద్ద 46 బీహెచ్‌పీ పవర్‌ను, 5,650 ఆర్‌పీఎం వద్ద 52 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మరోవైపు, BSA గోల్డ్‌స్టార్ 650 లో 652 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది ఐదు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 6,500 ఆర్‌పీఎం వద్ద 45 బీహెచ్‌పీ పవర్‌ను, 4,000 ఆర్‌పీఎం వద్ద 55 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
పవర్ అవుట్‌పుట్ (46 bhp) విషయంలో బుల్లెట్ 650 కొద్దిగా (1 bhp) మెరుగ్గా ఉంది. అయితే టార్క్ (55 Nm) విషయంలో BSA గోల్డ్‌స్టార్ 650 3 ఎన్ఎమ్ అదనపు టార్క్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా మెరుగైన లో-ఎండ్ పవర్‌ను అందిస్తుంది.
ధర అంచనా
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ బైక్ ధర సుమారు రూ.3.50 లక్షల (ఎక్స్-షోరూమ్) చుట్టూ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న BSA గోల్డ్‌స్టార్ 650 ధర రూ.3.09 లక్షల నుంచి రూ.3.26 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ధర పరంగా చూస్తే, బుల్లెట్ 650 కంటే BSA గోల్డ్‌స్టార్ కొంచెం తక్కువ ధరకు లభిస్తోంది.