Skoda : స్కోడా కార్లపై డిస్కౌంట్ల సునామీ.. ఏకంగా రూ.5 లక్షల వరకు తగ్గింపు
ఏకంగా రూ.5 లక్షల వరకు తగ్గింపు
Skoda : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే ఛాన్స్. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా ఆటో ఇండియా మార్చి నెలలో తన పాపులర్ ఎస్‌యూవీలు, సెడాన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం రంభం కావడానికి ముందే తన వద్ద ఉన్న పాత స్టాక్‌ను క్లియర్ చేసేందుకు కంపెనీ భారీగా ఆఫర్లను గుప్పిస్తోంది. కేవలం క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ స్కీమ్‌లు, లాయల్టీ ఇన్సెంటివ్‌ల రూపంలో కస్టమర్లు లక్షల రూపాయలు ఆదా చేసుకునే వీలుంది.
స్కోడా కుషాక్
హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి దిగ్గజాలకు పోటీగా నిలిచే స్కోడా కుషాక్ కొనుగోలుపై భారీ ఆఫర్లు ఉన్నాయి. 2026 మోడళ్లపై రూ.1.40 లక్షల వరకు తగ్గింపు లభిస్తుండగా, పాత స్టాక్ (MY25, MY24) మీద ఏకంగా రూ.3 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా మోంటే కార్లో, ప్రెస్టీజ్, స్పోర్ట్‌లైన్ వంటి టాప్ వేరియంట్లపై డీలర్లు భారీ రాయితీలు ఇస్తున్నారు. బడ్జెట్‌లో ప్రీమియం ఎస్‌యూవీ కావాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్.
స్కోడా స్లావియా
సెడాన్ కార్ల విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్లావియాపై కూడా స్కోడా భారీ ఆఫర్లు ప్రకటించింది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నాలకు గట్టి పోటీనిచ్చే ఈ కారు 2026 మోడళ్లపై వేరియంట్‌ను బట్టి రూ.60,000 నుంచి 5,000 వరకు డిస్కౌంట్ ఉంది. అదే మీరు పాత స్టాక్ మోడల్స్ ఎంచుకుంటే, ఏకంగా రూ.3 లక్షల వరకు ఆదా చేయవచ్చు. లగ్జరీ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి స్లావియా ఒక బెస్ట్ ఆప్షన్.
స్కోడా కోడియాక్
స్కోడా లైనప్‌లోనే అత్యంత ఖరీదైన, ప్రీమియం ఎస్‌యూవీ అయిన కోడియాక్‌పై ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా కోడియాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్‌పై ఏకంగా రూ.5 లక్షల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎల్ అండ్ కే సెలెక్షన్ వేరియంట్‌పై రూ.2.50 లక్షలు, ఎంట్రీ లెవల్ లాంజ్ వేరియంట్‌పై రూ.1.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఒక లగ్జరీ ఎస్‌యూవీని ఇంత తక్కువ ధరకు సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి కావచ్చు.
స్కోడా కైలాక్
టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి సబ్-4 మీటర్ ఎస్‌యూవీలతో పోటీ పడుతున్న స్కోడా కైలాక్ మీద కూడా కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తోంది. మిడ్-స్పెక్ సిగ్నేచర్, సిగ్నేచర్+ వేరియంట్లపై దాదాపు రూ.75,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఆటోమేటిక్ వేరియంట్లపై డిస్కౌంట్ కొంచెం తక్కువగా ఉంది.
మొత్తానికి చూస్తే, స్కోడా తన ఇన్వెంటరీని ఖాళీ చేసేందుకు కస్టమర్ల జేబుకు మేలు చేసేలా అద్భుతమైన డీల్స్ ఇస్తోంది. మీరు స్కోడా కారు కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే, ఈ మార్చి నెల కంటే మంచి సమయం మరొకటి ఉండదు.