Car Launch : డబ్బులు రెడీ చేస్కోండి.. నవంబర్, డిసెంబర్లో కొత్త కార్ల జాతర షురూ

నవంబర్, డిసెంబర్లో కొత్త కార్ల జాతర షురూ

Update: 2025-11-17 08:57 GMT

Car Launch : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఇప్పటికే గట్టి పోటీతో ఉంది. అయితే రాబోయే నెలల్లో ఇది మరింత ఆసక్తికరంగా మారబోతోంది. టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి టి దిగ్గజ సంస్థలు తమ కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త మోడళ్లలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ – మూడు రకాల పవర్‌ట్రైన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. మార్కెట్‌ను హీటెక్కించబోతున్న ఈ అప్‌కమింగ్ ఐదు మోడల్స్‌పై ఒక లుక్ వేద్దాం.

1. టాటా సియెర్రా

కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న టాటా సియెర్రా, కొత్త అవతార్‌లో తిరిగి మార్కెట్‌లోకి రాబోతోంది. సియెర్రా నవంబర్ 25న లాంచ్ కానుంది. దీని ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ మాత్రం జనవరి 2026లో విడుదల అవుతుంది. ఇందులో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. కొత్త 1.5 లీటర్ tGDi పెట్రోల్, 1.5 లీటర్ NA పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లు. ఇది ట్రిపుల్ స్క్రీన్ సెటప్ వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

2. టాటా హారియర్ పెట్రోల్, 3. టాటా సఫారి పెట్రోల్

ఇప్పటివరకు కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న టాటా హారియర్, సఫారి ఎస్‌యూవీలు, ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్‌తో కూడా రాబోతున్నాయి. ఈ రెండు ఎస్‌యూవీలు డిసెంబర్ 9న పెట్రోల్ ఇంజిన్‌తో లాంచ్ అవుతాయి. ఇందులో టాటా సంస్థ కొత్త 1.5-లీటర్ tGDi పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170hp పవర్, 280Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ లభిస్తాయి. డిజైన్, ఫీచర్లలో పెద్దగా మార్పులు ఉండవు.

4. మహీంద్రా XEV 9S – 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ ఎలక్ట్రిక్ మోడల్ కొత్త సంచలనం సృష్టించనుంది. మహీంద్రా XEV 9S నవంబర్ 27న లాంచ్ కానుంది. ఇది XUV700 ఎలక్ట్రిక్ వెర్షన్‌గా అంచనా వేస్తున్నారు. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు - 59 kWh, 79 kWh లభించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

5. మారుతి సుజుకి ఈ-విటారా

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి రాబోతున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇది. మారుతి ఈ-విటారా డిసెంబర్ 2, 2025న లాంచ్ కానుంది. దీని ఉత్పత్తి ఇప్పటికే గుజరాత్‌లోని హన్స్‌లపూర్ ప్లాంట్‌లో మొదలైంది. ఇందులో 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు లభిస్తాయి. పెద్ద బ్యాటరీ దాదాపు 500 కి.మీ రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. ఇది సింగిల్ మోటార్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది.

Tags:    

Similar News