CNG Cars : మారుతి, టాటా మధ్య మైలేజీ వార్.. బెస్ట్ సీఎన్‌జీ కారు ఏదో తెలిస్తే షాక్ అవుతారు
బెస్ట్ సీఎన్‌జీ కారు ఏదో తెలిస్తే షాక్ అవుతారు
CNG Cars : పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో మధ్యతరగతి సామాన్యుడి చూపు ఇప్పుడు సీఎన్‌జీ కార్ల వైపు మళ్లింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడమే కాకుండా, పర్యావరణానికి మేలు చేసే ఈ కార్లకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరి ప్రస్తుతం ఇండియాలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సీఎన్‌జీ కార్లు ఏవో, వాటి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి సెలేరియో
భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ కార్ల జాబితాలో మారుతి సుజుకి సెలేరియో అగ్రస్థానంలో ఉంది. ఈ కారు ఒక్క కిలో సీఎన్‌జీపై ఏకంగా 34.43 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.4.69 లక్షల నుంచి ప్రారంభమై, అన్ని ఛార్జీలు కలిపి ఆన్-రోడ్ రూ.5.51 లక్షల వరకు ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు ఇది ఒక వరప్రసాదం లాంటిది.
టాటా పంచ్ సీఎన్‌జీ
టాటా మోటార్స్ నుంచి వచ్చిన పంచ్ సీఎన్‌జీ స్టైలిష్ లుక్స్, మైలేజీ కలయికతో దూసుకుపోతోంది. ఇందులో 1.2 లీటర్ ఇంజిన్ ఉంటుంది, ఇది 73.5 hp పవర్‌ను ఇస్తుంది. ఒక్క కిలో సీఎన్‌జీకి ఇది 26.99 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.6.67 లక్షల నుంచి రూ.9.30 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది. సేఫ్టీ, మైలేజీ రెండూ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్‌జీ
చిన్న ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ ఎక్స్టర్ గట్టి పోటీ ఇస్తోంది. ఈ కారు సింగిల్, డ్యూయల్ సిలిండర్ ఆప్షన్లలో లభిస్తుంది. డ్యూయల్ సిలిండర్ వల్ల కారు డిక్కీలో సరుకులు పెట్టుకోవడానికి ఎక్కువ చోటు ఉంటుంది. ఇది కేజీ సీఎన్‌జీపై 27.10 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.86 లక్షల నుంచి రూ.8.76 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం ఫీచర్లు, సన్‌రూఫ్ వంటి ఆప్షన్లు కోరుకునే వారికి ఎక్స్టర్ పర్ఫెక్ట్ ఛాయిస్.
మీకు ఏది బెస్ట్?
మీ ప్రాధాన్యత కేవలం మైలేజీ మాత్రమే అయితే మారుతి సెలేరియో వైపు వెళ్ళవచ్చు. లేదు, మాకు సేఫ్టీ, ఎస్‌యూవీ లుక్ కావాలి అనుకుంటే టాటా పంచ్ లేదా హ్యుందాయ్ ఎక్స్టర్ ఆప్షన్లను పరిశీలించవచ్చు. ముఖ్యంగా ఎక్స్టర్ లో ఉన్న ట్విన్ సిలిండర్ టెక్నాలజీ లగేజీ పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఏదేమైనా పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈ సీఎన్‌జీ కార్లు నెలకు వేల రూపాయల ఇంధన ఖర్చును ఆదా చేస్తాయి.