Toyota Innova : పొలిటీషన్లు, సెలబ్రిటీలు మెచ్చారు.. 20ఏళ్లుగా రోడ్లపై రారాజు ఈ కారు
20ఏళ్లుగా రోడ్లపై రారాజు ఈ కారు;
Toyota Innova : భారత మార్కెట్లో టయోటా ఇన్నోవా తన ప్రస్థానాన్ని 20 ఏళ్లుగా కొనసాగిస్తోంది. ఈ రెండు దశాబ్దాలలో ఈ మల్టీ పర్పస్ వెహికల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇది ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. టయోటా సంస్థకు భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా ఇన్నోవా కార్లు అమ్ముడయ్యాయి. మరి ఇన్నోవా ఇంతగా పాపులర్ అవ్వడానికి కారణం ఏమిటి? దానిలోని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
టయోటా ఇన్నోవా 2004లో మొదటిసారిగా లాంచ్ అయిన తర్వాత మూడుసార్లు అప్‌డేట్ అయింది. ఇది ల్యాడర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడింది. మొదటి జనరేషన్ కారు టయోటా క్వాలిస్ స్థానాన్ని భర్తీ చేసింది. 2016లో విడుదలైన ఇన్నోవా క్రిస్టా మోడల్‌లో కొత్త డిజైన్, ఇంజిన్, అనేక ఫీచర్లు ఉన్నాయి. 2022లో వచ్చిన ఇన్నోవా హైక్రాస్ మోడల్ మోనోకోక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఇందులో ఫ్రంట్-వీల్-డ్రైవ్ లేఅవుట్, సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ అత్యధిక మైలేజీ ఇస్తుందని టయోటా పేర్కొంది. 2024 నవంబర్ నాటికి హైక్రాస్ లక్షకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఇన్నోవా అనేది టయోటా భారతీయ మార్కెట్ వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది సాధారణ కుటుంబాలకే కాకుండా, కమర్షియల్, ఇన్‌స్టిట్యూషనల్ సెక్టార్‌లలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. కాలక్రమేణా సేఫ్టీ, సౌలభ్యం, కాలుష్య నిబంధనలకు అనుగుణంగా ఇందులో మార్పులు చేశారు. ఈ రెండు దశాబ్దాలలో ట్యాక్సీ ఆపరేటర్ల నుంచి నగరాల్లోని కుటుంబాల వరకు అన్ని వర్గాల ప్రజలకు ఇన్నోవా ఫేవరెట్‌గా మారింది.
ఇన్నోవా క్రిస్టా బేస్ మోడల్ ధర రూ.19.99 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ ధర రూ.27.18 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). పెట్రోల్ వేరియంట్ 11.5 కి.మీ/లీ, డీజిల్ వేరియంట్ 15.1 కి.మీ/లీ. ఇన్నోవా హైక్రాస్ ధర రూ.19.14 లక్షల నుంచి రూ.32.58 లక్షల వరకు ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ 16.13 కి.మీ/లీ, హైబ్రిడ్ వేరియంట్ 23.24 కి.మీ/లీ వరకు ఇస్తుంది.