TVS NTORQ 150 : ఇది స్కూటర్ కాదు.. ఫైటర్ జెట్.. టీవీఎస్ కొత్త దాంతో అదరగొట్టేసిందిగా

టీవీఎస్ కొత్త దాంతో అదరగొట్టేసిందిగా

Update: 2025-09-05 04:09 GMT

TVS NTORQ 150 : టీవీఎస్ మోటార్ కంపెనీ దేశంలోనే మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని పేరు టీవీఎస్ ఎన్​టార్క్ 150. ఈ స్కూటర్ 149.7 సీసీ రేస్-ట్యూన్ ఇంజిన్‌తో వస్తుంది. దీని డిజైన్ స్టీల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి స్ఫూర్తి పొందింది. ఇది అధిక పర్ఫామెన్స్, స్పోర్టీ లుక్, అడ్వాన్సుడ్ టెక్నాలజీల కలయిక. న్యూ జనరేషన్ రైడర్ల కోసం దీన్ని స్పెషల్‎గా రూపొందించారు. దీని ప్రారంభ ధర రూ.1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని టాప్ మోడల్​ టీఎఫ్​టీ ధర కూడా రూ.1.19 లక్షలు గా ఉంది.

అడ్వాన్సుడ్ ఫీచర్లు

టీవీఎస్ ఎన్​టార్క్ 150లో మల్టీపాయింట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఏరోడైనమిక్ వింగ్‌లెట్స్, కలర్డ్ అల్లాయ్ వీల్స్, స్పెషల్ మఫ్లర్ సౌండ్ ఉన్నాయి. ఇందులో ఉన్న హై-రిజల్యూషన్ టీఎఫ్​టీ క్లస్టర్ 50కి పైగా స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. అలెక్సా, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, లైవ్ ట్రాకింగ్, నావిగేషన్, ఓటీఏ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ విభాగంలో ఇది అత్యంత అడ్వాన్సుడ్ స్కూటర్.

స్పీడు, పర్ఫామెన్స్

టీవీఎస్ ఎన్​టార్క్ 150లో 149.7 సీసీ ఎయిర్-కూల్డ్ ఓ3సీటెక్ ఇంజిన్ ఉంది. ఇది 7000 ఆర్​పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్, 5500 ఆర్​పీఎం వద్ద 14.2 ఎన్​ఎమ్ టార్క్ ఇస్తుంది. ఇది కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడు గంటకు 104 కిలోమీటర్లు. ఈ సెగ్మెంట్‌లో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ స్కూటర్.

డిజైన్, ఫీచర్లు

స్కూటర్ డిజైన్ స్టీల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి స్ఫూర్తి పొందింది. దీనిలో మల్టీపాయింట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ టెయిల్ ల్యాంప్స్, ఏరోడైనమిక్ వింగ్‌లెట్స్, జెట్-ఇన్‌స్పైర్డ్ వెంట్స్ ఉన్నాయి. దీనికి ప్రత్యేకమైన మఫ్లర్ సౌండ్, కలర్డ్ అల్లాయ్ వీల్స్, స్పోర్ట్-ట్యూన్ సస్పెన్షన్ ఉన్నాయి. సిగ్నేచర్ టీ టెయిల్ ల్యాంప్, గేమింగ్ కన్సోల్ నుంచి స్ఫూర్తి పొందిన టీఎఫ్​టీ డిస్​ప్లే ఉంది. ఇందులో టీవీఎస్ స్మార్ట్​ఎక్స్‌కనెక్ట్ ద్వారా 50కి పైగా ఫీచర్లు లభిస్తాయి. అలెక్సా, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వెహికల్ ట్రాకింగ్, చివరిగా పార్క్ చేసిన ప్రదేశం వంటివి ఇందులో ఉన్నాయి. కాల్, మెసేజ్, సోషల్ మీడియా అలర్ట్స్ సిస్టమ్, 2 రైడ్ మోడ్స్, ఓటీఏ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి.

సేఫ్టీ, ఫెసిలిటీ

ఈ స్కూటర్ తన సెగ్మెంట్‌లో తొలిసారిగా ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో వస్తుంది. క్రాష్, థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్, హ్యాజార్డ్ ల్యాంప్స్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ ఉన్నాయి. ఫాలో-మీ హెడ్‌ల్యాంప్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, అడ్జస్టబుల్ బ్రేక్ లీవర్స్ కూడా ఉన్నాయి. దీనిలో పేటెంట్ పొందిన ఈ-జెడ్ సెంటర్ స్టాండ్, 22 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ స్కూటర్ యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160 వంటి స్కూటర్లతో పోటీపడుతుంది.

Tags:    

Similar News