TVS Ntorq 125 vs Honda Dio 125: స్పీడ్ కావాలా? స్టైల్ కావాలా? మీ బడ్జెట్‌లో ఏ స్కూటర్ తోపు

మీ బడ్జెట్‌లో ఏ స్కూటర్ తోపు

Update: 2025-12-24 11:34 GMT

TVS Ntorq 125 vs Honda Dio 125: ఇండియన్ మార్కెట్లో 125 సీసీ స్కూటర్లకు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా యూత్ మెచ్చే స్టైలిష్ లుక్, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కూటర్ల కోసం అంతా వెతుకుతుంటారు. ఈ రేసులో ప్రస్తుతం టీవీఎస్ ఎన్‌టార్క్ 125, హోండా డియో 125 మధ్య గట్టి పోటీ నడుస్తోంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ స్కూటర్ కొంటే మీ పైసా వసూల్ అవుతుందో చూద్దాం.

ధరల యుద్ధం: ముందుగా ధరల విషయానికి వస్తే, హోండా డియో 125 ప్రారంభ ధర సుమారు రూ.85,433 నుంచి రూ.90,383 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అదే సమయంలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 బేస్ వేరియంట్ ధర రూ.80,900 నుంచే మొదలవుతుంది. అయితే ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్న రేస్ ఎక్స్‌పీ, ఎక్స్‌టీ వంటి టాప్ వేరియంట్ల ధర రూ.99,800 వరకు వెళ్తుంది. అంటే తక్కువ ధరలో స్కూటర్ కావాలంటే ఎన్‌టార్క్ బేస్ మోడల్ బెస్ట్, కానీ ప్రీమియం ఫీచర్లు కావాలంటే మాత్రం ఖర్చు తప్పదు.

ఇంజిన్ పవర్: పర్ఫార్మెన్స్ విషయంలో టీవీఎస్ ఎన్‌టార్క్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇందులో 124.8 సీసీ ఇంజిన్ ఉండగా.. ఇది 10.05 HP పవర్, 11.5 Nm టార్క్‌ను ఇస్తుంది. ముఖ్యంగా స్పీడ్ ఇష్టపడే వారికి ఎన్‌టార్క్ ఒక వరమనే చెప్పాలి. ఇక హోండా డియో 125 విషయానికి వస్తే, ఇందులో 123.92 సీసీ ఇంజిన్ ఉంది. ఇది 8.19 HP పవర్, 10.5 Nm టార్క్‌ను మాత్రమే ఇస్తుంది. అయితే హోండా ఇంజిన్ చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా, మైలేజీ విషయంలో ఎన్‌టార్క్ కంటే మెరుగ్గా ఉంటుంది.

హైటెక్ ఫీచర్లు: టెక్నాలజీ, ఫీచర్ల గురించి మాట్లాడితే ఎన్‌టార్క్ రాజనే చెప్పాలి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ అసిస్ట్, వాయిస్ అలర్ట్స్, రైడింగ్ స్టాటిస్టిక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. హోండా డియోలో అంత సీన్ లేదు. ఇందులో బేసిక్ డిజిటల్ కన్సోల్ మాత్రమే ఉంటుంది. కాకపోతే హోండాలో సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫంక్షన్ ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

రైడింగ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్ రెండింటిలోనూ 12-అంగుళాల ఫ్రంట్ వీల్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఎన్‌టార్క్ సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉంటుంది, దీనివల్ల హై స్పీడ్ వద్ద బండి చాలా స్టేబుల్‌గా ఉంటుంది. కానీ డియో 125 సస్పెన్షన్ సాఫ్ట్‌గా ఉండటం వల్ల రోడ్డు మీద గుంతలు ఉన్నా ప్రయాణం చాలా సుఖంగా సాగుతుంది. మీరు రోజువారీ ఆఫీస్ పనులకు, సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకుంటే హోండా డియో 125, అలా కాకుండా స్పోర్టీ లుక్, పవర్ కావాలనుకుంటే టీవీఎస్ ఎన్‌టార్క్ 125 తీసుకోవడం మంచిది.

Tags:    

Similar News