TVS Ntorq 150 : టీవీఎస్ ఎన్‌టార్క్ 150 లాంచ్‌కు సిద్ధం..ధర, ఫీచర్లు తెలిస్తే షాకే
ధర, ఫీచర్లు తెలిస్తే షాకే;
TVS Ntorq 150 : టీవీఎస్ మోటార్ కంపెనీ సెప్టెంబర్ 4, 2025న ఎన్‌టార్క్ 150 స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు కన్ఫాం చేసింది. అధికారిక లాంచ్, ధర ప్రకటనకు ముందు కంపెనీ ఒక టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్లో క్వాడ్-ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త టీ-ఆకారపు హౌసింగ్‌తో దీని ఫ్రంట్ డిజైన్ చూపించారు. కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 150 డిజైన్ దాని 125సీసీ వెర్షన్ మోడల్ లాగే ఉంటుందని భావిస్తున్నారు.
125సీసీ, 150సీసీ మోడళ్లకు తేడా చూపడానికి, టీవీఎస్ ఈ కొత్త స్కూటర్లో కొన్ని మార్పులు చేయవచ్చు. ఉదాహరణకు, పెద్ద వీల్స్ ఉండే అవకాశం ఉంది. కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 150లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్-ఛానల్ ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉండే అవకాశం ఉంది. ఎన్‌టార్క్ 150 ఇంజిన్ వివరాలు ఇంకా తెలియలేదు.. కానీ ఇది పూర్తిగా కొత్త ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. రిలీజ్ తర్వాత ఈ కొత్త టీవీఎస్ 150సీసీ స్కూటర్ హీరో జూమ్ 160, యమహా ఏరోక్స్ 155కి గట్టి పోటీ ఇస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 1.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు.
టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల భారతదేశంలో తన మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్, టీవీఎస్ ఆర్బిటర్‌ను విడుదల చేసింది. రూ. 99,900 ధర ఉన్న ఈ స్కూటర్ ఏథర్ రిజ్తాకు గట్టి పోటీ ఇస్తుంది. ఆర్బిటర్ 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. దీని రేంజ్ 158 కిలోమీటర్లు. ఇందులో కనెక్టెడ్ టెక్నాలజీ, టీవీఎస్ స్మార్ట్ జోనెక్ట్ యాప్ సపోర్ట్, ఓటీఏ అప్‌డేట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ ఛార్జింగ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.
టీవీఎస్ ఆర్బిటర్‌కు ముందు 14 అంగుళాల, వెనుక 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. సీట్ కింద 34 లీటర్ల స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ ఉంది. దీని డిజైన్లో పెద్ద ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్ బార్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, చిన్న విండ్‌స్క్రీన్, వెడల్పుగా ఉన్న హ్యాండిల్‌బార్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ఈ కొత్త టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆరు రంగులలో అందుబాటులో ఉంది - మార్టిన్ కాపర్, లూనార్ గ్రే, స్టార్‌టోస్ బ్లూ, కాస్మిక్ టైటానియం, నియాన్ సన్‌బర్స్ట్, స్టెల్లార్ సిల్వర్.