TVS Ronin: ప్రముఖ టీ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ తన అత్యంత ప్రజాదరణ పొందిన రోనిన్ మోటార్ సైకిల్‌లో మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పటికే మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న ఈ బైక్‌కు అదనపు ఆకర్షణగా బేస్ ప్లస్ వేరియంట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుత బేస్, మిడ్ మోడల్స్‌ మధ్యలో దీన్ని పొందుపరిచారు. దీంతో ఇప్పుడు టీవీఎస్ రోనిన్ బైక్ మొత్తం 4 వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.26 లక్షల నుంచి ప్రారంభమై రూ.1.64 లక్షల వరకు ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌కు ఇది గట్టి పోటీ ఇస్తుంది.

బేస్ ప్లస్ ప్రత్యేకత

ఈ కొత్త బేస్ ప్లస్ వేరియంట్‌లో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందించారు. సాధారణ బేస్ మోడల్‌లో సింగిల్-చానల్ ఏబీఎస్ మాత్రమే ఉండగా, ఈ కొత్త వేరియంట్‌లో అత్యంత కీలకమైన డ్యూయల్-చానల్ ఏబీఎస్ ఫీచర్‌ను జతచేశారు. తక్కువ ధరకే డ్యూయల్-చానల్ ఏబీఎస్ కోరుకునే బైక్ లవర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనితో పాటు ఈ వేరియంట్‌లో రెండు కొత్త ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ పరిచయం చేసింది. రోనిన్ లైనప్‌లో తక్కువ ధరకే ఈ సేఫ్టీ ఫీచర్ లభించే మోడల్‌గా ఇది నిలుస్తుంది.

అడ్వాన్సుడ్ ఫీచర్లు, రైడింగ్ మోడ్స్

ఫీచర్ల పరంగా చూస్తే ఇందులో రెయిన్, అర్బన్ అనే రెండు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ బరువు సుమారు 159 కిలోగ్రాములుగా ఉండి, ఇతర వేరియంట్ల కంటే దాదాపు కిలో తక్కువగా ఉంటుంది. ఇందులో ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్, ప్రత్యేకమైన అసిమెట్రిక్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఈ డిస్‌ప్లే ద్వారా స్పీడ్, గేర్ పొజిషన్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, ట్యాకోమీటర్ వంటి ఎన్నో కీలకమైన సమాచారాన్ని రైਡర్ సులభంగా తెలుసుకోవచ్చు.

పవర్ఫుల్ ఇంజిన్, మెకానికల్ వివరాలు

ఈ కొత్త బేస్ ప్లస్ వేరియంట్ ఇంజిన్, మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు లేకుండా మునుపటి మోడల్ మాదిరిగానే కొనసాగుతోంది. ఇందులో 225.9 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 20.1 బిహెచ్‌పి పవర్‌ను, 19.9 ఎన్ఎం టార్గ్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ రైడింగ్‌తో పాటు లాంగ్ జర్నీలకు కూడా ఈ బైక్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags: