Upcoming Cars : రూ.10లక్షలు రెడీ చేస్కోండి.. 5 కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్

5 కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్;

Update: 2025-06-30 05:29 GMT

Upcoming Cars : ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని కొత్త కొత్త కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. భారత మార్కెట్‌లోకి త్వరలో ఐదు కొత్త కార్ల మోడల్స్ రాబోతున్నాయి. ఇవి రూ.10 లక్షల లోపే దొరుకుతాయని అంచనా. ఈ ఐదు మోడల్స్ కొత్త సేఫ్టీ ఫీచర్లతో వచ్చే 6 నుంచి 12 నెలల్లో కస్టమర్ల ముందుకు రాబోతున్నాయి.

1. కొత్త హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఈ పాపులర్ ఎస్‌యూవీ వెన్యూ నెక్స్ట్ జెనరేషన్ మోడల్ ఈ ఏడాది పండుగల సీజన్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ డిజైన్‌లో మార్పులు ఉండొచ్చు కానీ, ఇంజిన్‌లో పెద్దగా మార్పులు ఉండవని అంటున్నారు. అయితే, ఇందులో అతిపెద్ద అప్‌గ్రేడ్ ఏంటంటే, మీ భద్రత కోసం లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్‌లను యాడ్ చేయనున్నారు. ఇది డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తుంది.

2. టాటా పంచ్ ఈవీ ఫేస్‌లి

టాటా మోటార్స్ త్వరలో తమ పాపులర్ ఎస్‌యూవీ పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేయబోతోంది. కారు సైజులో మార్పు ఉండదు. కానీ, బయటి డిజైన్‌లో లోపలి భాగంలో చాలా కొత్త అప్‌గ్రేడెడ్ ఫీచర్లు కనిపిస్తాయట. టాటా పంచ్ పెట్రోల్ ఇప్పటికే సూపర్ హిట్. ఇప్పుడు ఈవీ కూడా వస్తే, అదిరిపోతుంది.

3. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఈవీ

మహీంద్రా కంపెనీ కూడా త్వరలో తమ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేయబోతోంది. మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోలో ఇది ఎక్స్‌యూవీ400 కంటే తక్కువ ధరలో వస్తుంది. దీనికి టాటా పంచ్ ఈవీతో గట్టి పోటీ ఉండొచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఒకేసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 450 కిలోమీటర్ల వరకు వెళ్తుందట.

4. మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్

మారుతి సుజుకి తమ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ హైబ్రిడ్ వెర్షన్‌ను త్వరలో లాంచ్ చేయబోతోంది. ఈ కారులో 1.2 లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కలిసి పనిచేస్తుంది. దీనివల్ల ఇంధన ఆదా పెరిగి, పొల్యూషన్ తగ్గుతుంది. కొన్ని విదేశీ మార్కెట్లలో అయితే ఈ కారులో ఏడీఏఎస్ ఫీచర్లు కూడా ఉండొచ్చని అంటున్నారు. మారుతి అంటేనే మైలేజ్ కింగ్ కదా, ఈ హైబ్రిడ్ వెర్షన్ ఇంకెంత మైలేజ్ ఇస్తుందో చూడాలి.

5. రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్

రెనాల్ట్ కంపెనీకి చెందిన కైగర్ కారును గత కొన్ని నెలలుగా టెస్టింగ్ చేస్తుండగా చాలా సార్లు కెమెరాల కంట పడింది. ఈ కొత్త కారు డిజైన్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇందులో చాలా కొత్త ఫీచర్లను కూడా జోడించబోతున్నారని తెలుస్తోంది. తక్కువ ధరలో మంచి ఎస్‌యూవీ కావాలనుకునే వాళ్లకు కైగర్ మంచి ఆప్షన్. ఇప్పుడు కొత్త మోడల్ వస్తే ఇంకా బాగుంటుంది.

Tags:    

Similar News