Volkswagen : బ్రెజా, వెన్యూలకు వణుకు.. సబ్-4 మీటర్ మార్కెట్ లోకి ఫోక్స్ వ్యాగన్ ఎంట్రీ

సబ్-4 మీటర్ మార్కెట్ లోకి ఫోక్స్ వ్యాగన్ ఎంట్రీ

Update: 2026-03-09 08:45 GMT

Volkswagen : భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల గోలే వినిపిస్తోంది. ముఖ్యంగా తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు ఇచ్చే సబ్-4 మీటర్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ మార్కెట్లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి దిగ్గజాలు రాజ్యమేలుతుండగా, ఇప్పుడు జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ ఫాక్స్ వ్యాగన్ కూడా ఈ రేసులోకి దూకడానికి రంగం సిద్ధం చేసుకుంది. తన భాగస్వామ్య సంస్థ స్కోడా కైలాక్ సృష్టించిన సెన్సేషన్‌ను స్ఫూర్తిగా తీసుకుని, 2027 మధ్య నాటికి సరికొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ఫోక్స్ వ్యాగన్ రాబోయే ఈ కొత్త కారు, స్కోడా కైలాక్ నిర్మించిన అదే ప్లాట్‌ఫారమ్ మీద తయారవుతుంది. గతంలో టైగన్, కుషాక్ విషయంలో కూడా ఇదే ఫార్ములాను వాడారు. ఇంజన్, టెక్నాలజీ ఒక్కటే అయినప్పటికీ, ఫోక్స్ వ్యాగన్ తన మార్కు డిజైన్‌తో దీనిని చాలా విభిన్నంగా తీర్చిదిద్దుతోంది. కొత్త ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ బంపర్లు, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు,టెయిల్‌లైట్లతో ఈ కారు చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉండబోతోంది. ముఖ్యంగా జర్మన్ కార్లంటే ఇష్టపడే వారికి ఈ డిజైన్ బాగా నచ్చుతుంది.

ఈ కొత్త ఎస్‌యూవీలో స్కోడా కైలాక్‌లో వాడిన 1.0 లీటర్, మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఇది సుమారు 115 BHP పవర్‌ను, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో ఉంటాయి. డైరెక్ట్ ఇంజెక్షన్, టర్బోచార్జింగ్ టెక్నాలజీ వల్ల కారు వేగంగా దూసుకుపోవడమే కాకుండా మంచి మైలేజీని కూడా ఇస్తుంది. బ్రేకింగ్ విషయంలోనూ పక్కాగా ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేకులను ఇస్తున్నారు.

సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ఫోక్స్ వ్యాగన్ ఈ కారు ధరను ప్లాన్ చేస్తోంది. ప్రారంభ వేరియంట్ ధర సుమారు రూ.7.60 లక్షల నుంచి మొదలై, టాప్ మోడల్ రూ.14 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఒకవేళ ఇదే ధరతో మార్కెట్లోకి వస్తే.. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మరియు మారుతి బ్రెజాలకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం. క్వాలిటీ, సేఫ్టీ విషయంలో జర్మన్ కార్లకు ఉన్న పేరును నిలబెడుతూ, ఈ కారు మధ్యతరగతి ప్రజల కలల ఎస్‌యూవీగా మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News