Volkswagen : బంపర్ ఆఫర్ కొత్త ఎస్యూవీ కొనేవారికి పండుగే.. ఈ మోడల్ పై రూ.2.50 లక్షల డిస్కౌంట్

ఈ మోడల్ పై రూ.2.50 లక్షల డిస్కౌంట్;

Update: 2025-08-08 05:27 GMT

 Volkswagen : ఈ ఆగస్టులో కొత్త ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అస్సలు మిస్సవద్దు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ తమ పాపులర్ ఎస్‌యూవీ టైగన్ పై ఈ నెలలో భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కస్టమర్లు ఏకంగా రూ.2.50 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఈ భారీ ఆఫర్ వివరాలు, టైగన్ ఫీచర్లు, ఇంజిన్, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆగస్టు నెలలో ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ ఎస్‌యూవీపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు ఏకంగా రూ.2.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే సమీపంలోని ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఆకర్షణీయమైన డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో వస్తుంది. క్రోమ్ డీటైలింగ్‌తో బోల్డ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డిఆర్ఎల్ఎస్, 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. లోపల 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టైగన్‌లో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజిన్.. ఇది 115 bhp పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజిన్.. ఇది మరింత పవర్ఫుల్. ఇది 150 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డిఎస్‌జి (DSG) వంటి గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

టైగన్ కేవలం ఫీచర్లలోనే కాకుండా సేఫ్టీలో కూడా ముందుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్, రివర్స్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో టైగన్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్ వంటి కార్లతో పోటీ పడుతుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.11.70 లక్షల నుంచి రూ.19.74 లక్షల వరకు ఉన్నాయి. ఈ భారీ డిస్కౌంట్ ఈ ఎస్‌యూవీని కొనాలనుకునేవారికి మంచి అవకాశం.

Tags:    

Similar News