Yamaha XSR 155 : రెట్రో-స్టైల్ బైక్ వచ్చేసింది..యమహా నయా బైక్ డెలివరీలు షురూ

యమహా నయా బైక్ డెలివరీలు షురూ

Update: 2025-11-16 09:14 GMT

Yamaha XSR 155 : భారతీయ బైక్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యామాహా XSR 155 మోటార్‌సైకిల్ ఎట్టకేలకు మార్కెట్‌లోకి వచ్చేసింది! ఈ బైక్ కోసం ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా యమహా కంపెనీ కొన్ని సెలక్ట్ చేసిన నగరాల్లో ఈ బైక్ డెలివరీలను కూడా ప్రారంభించింది. దీంతో కొత్త బైక్ కొనుగోలుదారులు వారి XSR 155 బైక్‌లను ఇంటికి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియో-రెట్రో స్టైల్‌లో వచ్చిన ఈ బైక్ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్ వంటి పాపులర్ మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

యమహా XSR 155 బైక్‌లో ప్రధాన ఆకర్షణ దాని స్టైలింగ్, డిజైన్. దీనికి నియో-రెట్రో లుక్ ఇవ్వడం జరిగింది. అంటే పాతకాలం బైక్‌లను గుర్తుచేసే రౌండ్ షేప్‌లో LED హెడ్‌ల్యాంప్, సింపుల్‌గా ఉండే బాడీవర్క్, ప్రీమియం ట్యాంక్ డిజైన్ ఉన్నాయి. ఈ బైక్ మొత్తం లుక్ చాలా ప్రత్యేకంగా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఫీచర్ల విషయంలో కూడా యమహా ఎక్కడా తగ్గలేదు. ఇందులో ఆల్-LED లైటింగ్, కంప్లీట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, డబుల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంది.

పనితీరు విషయానికి వస్తే, యామాహా XSR 155 చాలా పవర్ఫుల్. ఇందులో కంపెనీ 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించింది. ఇందులో VVA టెక్నాలజీ కూడా ఉంది. ఈ ఇంజిన్ దాదాపు 18.1bhp పవర్, 14.2Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ కారణంగా ఈ బైక్ సిటీ రైడింగ్‌తో పాటు హైవేపై కూడా చాలా వేగంగా, స్మూత్‌గా ప్రయాణిస్తుంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉండటం వల్ల ఏ రకమైన రోడ్ల మీదైనా ఈ బైక్ మంచి రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఎక్కువ కాలం ఎదురుచూసిన రైడర్లకు ఈ బైక్ మంచి థ్రిల్ ఇవ్వడం ఖాయం.

Tags:    

Similar News