కేటీఆర్ ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకు తెలంగాణ గవర్నర్ అనుమతి
Governor Approves Prosecution of KTR in Formula-E Corruption Case ACB Gains Green Signal to Interrogate MLA KTR After 10-Week Wait
ఫార్ములా-ఈ రేస్ కేసులో అత్యంత కీలక పరిణామం.
కేటీఆర్ కు బిగ్ షాక్:
కేటీఆర్ ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకు తెలంగాణ గవర్నర్ అనుమతి
ఇప్పటికే కేటీఆర్ ను నాలుగు సార్లు, అరవింద్ కుమార్ ను అయిదు సార్లు విచారించిన ఏసీబీ.
ఈ కేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ ను, ఎలెక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను సేకరించిన ఏసీబీ.
తొమ్మిది నెలల పాటు పకడ్బందీగా అన్ని కోణాల నుండి విచారణ జరిపిన ఏసీబీ .
ఎమ్మెల్యే అయిన కేటిఆర్ ను ప్రాసిక్యూట్ చేసేటందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 9 న గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది. 10 వారాల తర్వాత గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు DoPT అనుమతి కొరకు ఎదురుచూస్తున్న ఏసీబీ. ఆ అనుమతి రాంగనే కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ ఎన్ రెడ్డి లపై ఛార్జి షీట్ దాఖలు చేయనున్న ఏసీబీ.