Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ..నాల్గవ రౌండ్ పూర్తి..
నాల్గవ రౌండ్ పూర్తి..
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలకు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆ నియోజక వర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 186 మంది సిబ్బంది ఈ ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నికలో 48.49 శాతం ఓటింగ్ నమోదు అయింది. మొత్తం 1,94,631 ఓట్లు పోలయ్యాయి. బోరబండ డివిజన్‌లో అత్యధికంగా 55.92 శాతం, సోమాజిగూడలో అత్యల్పంగా 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ 10 రౌండ్లలో పూర్తి కానుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రం పెద్ద పెద్ద ఎత్తున పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు.ప్రస్తుతం నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3100కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఉండగా.. బీజేపీ దరిదాపుల్లో లేకుండా పోయింది.
For more updates: https://youtu.be/5aPwhjmxKaY