ఢిల్లీలో భారీ వర్షం...విమానాల రద్దు

Heavy rain lashed Delhi on Sunday morning, causing cancellation of several flights.;

Update: 2025-05-25 05:35 GMT

దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున జోరుగా వాన పడింది ఢిల్లీతోపాటు ఎన్సిఆర్(NCR) ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఈదురుగాలులకు పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ప్రధాన జంక్షన్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.

వర్షం, ఈదురుగాలుల ధాటికి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు వంద విమానాలు రద్దు చేయగా... మరో 25 విమానాలను దారి మళ్లించారు.

ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్టు అడ్వైజరీ జారీచేసింది. ప్రతికూల వాతావరణంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని, సర్వీసులను పునరుద్ధరించలేదని పేర్కొంది. ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరింది.

ఢిల్లీతోపాటు NCR ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సఫ్దర్జంగ్ ప్రాంతంలో 81 మిల్లీ మీటర్లు, పాలెంలో 68 మిల్లి మీటర్లు, పూసా 71 మిల్లి మీటర్లు, మయూర్ విహార్లో 48 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వెల్లడించింది. భారీ వర్షంతో మింటో రోడ్డు ప్రాంతం నీటితో నిండిపోవడంతో ఓ కారు మునిగిపోయింది.

Tags:    

Similar News