Amazon : అమెజాన్ సేల్ మొదలైంది.. టీవీలపై ఏకంగా 58% డిస్కౌంట్.. దేనిపై ఎంతంటే ?
టీవీలపై ఏకంగా 58% డిస్కౌంట్.. దేనిపై ఎంతంటే ?;
Amazon : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 వచ్చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్‌లు ఇస్తున్నారు. 32 ఇంచులు, 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచుల టీవీల వరకు భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. టీవీల ధరపై ఇచ్చే డిస్కౌంట్‌తో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడితే అదనంగా 10% డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. అలాగే, చాలా టీవీలకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
32 ఇంచుల రెడ్‌మీ టీవీపై 58% డిస్కౌంట్
32 అంగుళాల రెడ్‌మీ F సిరీస్ టీవీ: ఈ టీవీ అసలు ధరపై 58 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,499కే లభిస్తోంది. ఇందులో 20 వాట్ స్పీకర్లు, డాల్బీ ఆడియో, హెచ్‌డి రిజల్యూషన్, 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉన్నాయి. చిన్న గదికి లేదా తక్కువ బడ్జెట్‌లో టీవీ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
43 ఇంచుల ఫిలిప్స్ టీవీపై 23% తగ్గింపు!
43 అంగుళాల ఫిలిప్స్ టీవీ: మీరు 32 అంగుళాల కంటే పెద్ద టీవీ కోరుకుంటే ఈ మోడల్ చూడవచ్చు. దీనిపై 23 శాతం తగ్గింపు ఉంది. ఇప్పుడు ఈ టీవీ ధర రూ.22,999. ఇది మీ లివింగ్ రూమ్‌కి పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.
50 ఇంచుల షియోమీ టీవీపై 44% తగ్గింపు!
50 అంగుళాల షియోమీ టీవీ: పెద్ద స్క్రీన్ టీవీని తక్కువ ధరలో కొనాలనుకుంటే ఇది మంచి డీల్. ఈ టీవీ 44 శాతం తగ్గింపుతో కేవలం రూ.27,999కే లభిస్తోంది. ఇందులో 30 వాట్ స్పీకర్లు, డాల్బీ ఆడియో, డాల్బీ విజన్, HDR10, 4K రిజల్యూషన్, 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.
55 ఇంచుల కోడాక్ టీవీపై 51% తగ్గింపు!
55 అంగుళాల కోడాక్ టీవీ: ఇంకా పెద్ద సైజు టీవీ కావాలంటే, ఈ మోడల్‌ను చూడవచ్చు. దీనిపై 51 శాతం తగ్గింపు ఉంది. ఇప్పుడు దీని ధర రూ.29,479. ఇందులో 4K అల్ట్రా రిజల్యూషన్, 40 వాట్ సౌండ్ అవుట్‌పుట్, HDR10, డ్యుయల్ బ్యాండ్ వై-ఫై సపోర్ట్ ఉన్నాయి.