Mukesh Ambani : అంబానీ ఇంట్లో పనివాడికి అంత జీతమా? సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కంటే యాంటిలియాలో పనే బెటర్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కంటే యాంటిలియాలో పనే బెటర్
Mukesh Ambani : ముంబైలోని అల్టామౌంట్ రోడ్‌లో ఉండే ముకేశ్ అంబానీ నివాసం యాంటిలియా గురించి తెలియని వారుండరు. 27 అంతస్తుల ఈ భవనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. అయితే ఇంత పెద్ద ప్యాలెస్‌ను మెయింటెయిన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీని కోసం అంబానీ ఒక పెద్ద సైన్యాన్నే మేపుతున్నారు. అక్కడ పనిచేసే సిబ్బందికి ఇచ్చే జీతాలు, సౌకర్యాలు చూస్తే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా కుళ్లుకోవాల్సిందే.
600 మందితో ఒక భారీ సైన్యం
యాంటిలియా భవనం ఒక ఫైవ్ స్టార్ హోటల్ కంటే ఎక్కువే అని చెప్పాలి. ఈ 27 అంతస్తుల భవనాన్ని అద్దంలా మెరిపించడానికి సుమారు 600 మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. ఇందులో కేవలం క్లీనర్లు మాత్రమే కాదు.. హైలీ ట్రైన్డ్ సెక్యూరిటీ గార్డ్స్, ప్రపంచస్థాయి వంటలు చేసే షెఫ్‌లు, పర్సనల్ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఏసీ టెక్నీషియన్లు ఇలా ఒక పెద్ద టీమ్ ఉంటుంది. వీరంతా షిఫ్టుల వారీగా పనిచేస్తూ అంబానీ కుటుంబానికి ఒక్క సెకను కూడా అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు.
జీతం అక్షరాలా లక్షల్లోనే
మనం సాధారణంగా ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చే జీతం వేలల్లో ఉంటుందని అనుకుంటాం. కానీ అంబానీ రేంజే వేరు. యాంటిలియాలో పనిచేసే వారికి ఇచ్చే జీతాలు కార్పొరేట్ ఆఫీసుల్లో మేనేజర్ల జీతాల కంటే ఎక్కువగా ఉంటాయని సమాచారం. నివేదికల ప్రకారం, ఇక్కడ పనిచేసే సీనియర్ సిబ్బందికి నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు జీతం అందుతుంది. వారి అనుభవం, వారు చేసే పనిని బట్టి ఈ మొత్తం మారుతూ ఉంటుంది. ఒక హెడ్ షెఫ్ లేదా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ జీతం అయితే ఇంకా ఎక్కువే ఉండొచ్చు.
కేవలం జీతమే కాదు.. బోలెడు బెనిఫిట్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో, తన ఇంట్లో పనిచేసే వారికి కూడా అంబానీ అవే సదుపాయాలు కల్పిస్తారు. మంచి జీతంతో పాటు భారీ మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వీరికి యాంటిలియాలోనే భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వీరి పిల్లల చదువుల కోసం కూడా అంబానీ కుటుంబం ఆర్థిక సహాయం చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షన్ వంటి బెనిఫిట్స్ ఉండటంతో, ఇక్కడ ఒక్కసారి ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్లేనని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తుంటారు.