Bank Holidays : 5 కాదు, 10 కాదు... జనవరి నెలలో ఏకంగా 16 రోజులు సెలవులే సెలవులు

జనవరి నెలలో ఏకంగా 16 రోజులు సెలవులే సెలవులు

Update: 2025-12-24 11:27 GMT

Bank Holidays : కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కానున్న సందర్భంగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ జనవరి నెల బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఆర్‌బీఐ ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. జనవరి నెలలో ఏకంగా 16 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే, ఈ 16 రోజులు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఒకేసారి మూసి ఉండవు. సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఈ సెలవులలో 6 సెలవులు రెండవ, నాల్గవ శనివారాలు, 4 సెలవులు ఆదివారాలు ఉన్నాయి. మిగిలిన 10 సెలవులు జాతీయ, రాష్ట్ర స్థాయి పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా ఉంటాయి. జనవరి నెలలో మీకు ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉంటే, మీ సిటీలో సెలవుల జాబితాను ఒకసారి తప్పకుండా చూసుకోవాలని ఆర్‌బీఐ వినియోగదారులకు సూచించింది.

జనవరి 2026లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు శాఖలు నూతన సంవత్సర దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి, బిహు, మకర సంక్రాంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, గణతంత్ర దినోత్సవం వంటి వివిధ పండుగలు, సందర్భాల కారణంగా మూసి ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో వరుసగా రెండు లేదా మూడు రోజుల పాటు కూడా బ్యాంకులు బంద్ అయ్యే అవకాశం ఉంది.

ప్రధాన పండుగల వారీగా సెలవులు (కొన్ని ముఖ్యమైన నగరాలు):

జనవరి 1 (నూతన సంవత్సర దినోత్సవం): ఐజాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, షిల్లాంగ్‌లలో బ్యాంకులు బంద్.

జనవరి 14 (మకర సంక్రాంతి): అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి, ఇటానగర్‌లలో బంద్.

జనవరి 15 (ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/సంక్రాంతి): బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, విజయవాడ లలో బంద్.

జనవరి 26 (గణతంత్ర దినోత్సవం): ఈ రోజు అగర్తలా, అహ్మదాబాద్, ఐజాల్, బెలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం, విజయవాడ లతో సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

వారాంతపు సెలవులు (దేశవ్యాప్తంగా)

కింది తేదీలలో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్ శాఖలు మూసి ఉంటాయి:

జనవరి 4: ఆదివారం

జనవరి 10: రెండవ శనివారం

జనవరి 11: ఆదివారం

జనవరి 18: ఆదివారం

జనవరి 24: నాల్గవ శనివారం

జనవరి 25: ఆదివారం

బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం, ఆన్‌లైన్ సేవలు ఈ సెలవు రోజులలో కూడా యథావిధిగా అందుబాటులో ఉంటాయి.

Tags:    

Similar News