EPFO : అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే మీ పీఎఫ్ డబ్బులు చిక్కుకుపోతాయి
ఈ పని చేయకపోతే మీ పీఎఫ్ డబ్బులు చిక్కుకుపోతాయి;
EPFO : ప్రతి నెలా మీ ఈపీఎఫ్ఓ అకౌంట్లో పీఎఫ్ డబ్బులు పడుతున్నాయా? భవిష్యత్తులో, రిటైర్మెంట్ తర్వాత లేదా అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బును తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే, కొన్ని ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. లేకపోతే, మీ ఈపీఎఫ్ఓ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేరు. దీంతో మీరు భారీ నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. మరి మీ పీఎఫ్ డబ్బులు సులభంగా, ఎలాంటి అడ్డంకి లేకుండా తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
యూఏఎన్ కి ఆధార్ లింక్ చేయండి
మీ యూఏఎన్ ని మీ ఆధార్ కార్డుతో లింక్ తప్పనిసరి లింక్ చేయాలి. మీరు మీ యూఏఎన్‌కి ఆధార్ లింక్ చేయకపోతే, మీ యూఏఎన్ డీయాక్టివేట్ అయిపోతుంది. అలాంటప్పుడు, మీ పీఎఫ్ డబ్బులు ఈపీఎఫ్ఓ అకౌంట్లో జమ కావు. అంతేకాకుండా, మీరు మీ ఈపీఎఫ్ఓ అకౌంట్ నుంచి పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోలేరు. కాబట్టి, ఈ పనిని ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే పూర్తి చేసుకోండి.
నామినీ పేరు తప్పకుండా చేర్చాలి
ఈపీఎఫ్ఓ అకౌంట్లో మీరు నామినీ పేరును చేర్చకపోతే, కూడా మీరు మీ ఈపీఎఫ్ఓ అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోలేరు. ఒకవేళ ఉద్యోగికి ఏదైనా అనుకోనిది జరిగితే, నామినీ పేరు లేకపోతే, ఆ డబ్బును కుటుంబ సభ్యులు పొందడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి, వెంటనే మీ ఈపీఎఫ్ఓ అకౌంట్లో నామినీ పేరును యాడ్ చేయాలి. దీనితో పాటు, మీ ఈపీఎఫ్ఓ అకౌంట్లో కేవైసీ (KYC) వివరాలను కూడా అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. కేవైసీ అప్డేట్లు బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ వంటి వివరాలను కలిగి ఉంటాయి. ఇవి లేకపోతే, క్లెయిమ్‌లు ఆలస్యం అవుతాయి లేదా తిరస్కరించబడతాయి.
పీఎఫ్ అకౌంట్లో మొబైల్ నంబర్ని ఎలా అప్డేట్ చేయాలి?
మీ పీఎఫ్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ మారినట్లయితే దానిని వెంటనే అప్డేట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో చేసుకోవచ్చు.
* ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ (https://www.epfindia.gov.in/)కి వెళ్లాలి.
* మీ యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
* లాగిన్ అయిన తర్వాత, 'Manage' టాబ్‌లోకి వెళ్లి 'Contact Details' ఆప్షన్‌ను ఎంచుకోండి.
* ఇక్కడ, మీ కొత్త మొబైల్ నంబర్‌ను రెండుసార్లు జాగ్రత్తగా ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత 'Get Authorization PIN'పై క్లిక్ చేయాలి.
* మీ కొత్త నంబర్‌కు 4 అంకెల పిన్ (OTP) వస్తుంది.
* ఆ పిన్ను ఎంటర్ చేసి 'Save Changes' పై క్లిక్ చేయండి.
* కొద్దిసేపట్లోనే, ఈపీఎఫ్ఓ నుండి మీ మొబైల్ నంబర్ అప్డేట్ అయినట్లు SMS ద్వారా మెసేజ్ వస్తుంది.
ఈ పనులు ఎందుకు ముఖ్యం
ఈ పనులన్నీ పూర్తి చేయకపోతే, మీ పీఎఫ్ డబ్బులు మీ ఖాతాలో ఉన్నా కూడా మీరు వాటిని పొందలేరు. ఆధార్ లింకింగ్, నామినీ అప్డేట్, కేవైసీ అప్డేట్లు లేకుండా ఆన్లైన్ పీఎఫ్ క్లెయిమ్‌లు సాధ్యం కావు. ఆధార్ లింకింగ్ అనేది మీ గుర్తింపును ధృవీకరిస్తుంది, నామినీ మీ మరణానంతరం డబ్బు మీ కుటుంబానికి చేరేలా చూస్తుంది, కేవైసీ వివరాలు మీ ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా, పారదర్శకంగా ఉంచుతాయి.