Xi Jinping: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆస్తి ఎంతో తెలుసా? నెలకు ఆయనకు వచ్చే జీతం తెలిస్తే షాకే
జీతం తెలిస్తే షాకే
Xi Jinping: న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సుమారు ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపించే ఈ మహానేత నెలకు ఎంత జీతం తీసుకుంటారు, ఆయన కుటుంబానికి ఎంత ఆస్తి ఉందనే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. భారత్, చైనా సరిహద్దుల్లో గతంలో జరిగిన ఘర్షణల తర్వాత ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంతర్జాతీయ రాజకీయంలో మారిన సమీకరణాలు, అమెరికా సుంకాల హెచ్చరికల నేపధ్యంలో ఆసియాలోని ఇద్దరు అగ్రనేతలు మళ్లీ ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు భారత్ వచ్చిన జిన్‌పింగ్ వ్యక్తిగత విషయాలు, ఆయన ఆస్తుల గురించిన విశేషాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జిన్‌పింగ్‌కు వచ్చే జీతం ఎంత అంటే?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వ్యాపారాలు, ఆస్తుల గురించి బహిరంగంగా చర్చల్లో ఉంటారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విషయంలో అలా జరగదు. అధికారిక లెక్కల ప్రకారం ఆయనకు వచ్చే జీతం ప్రపంచంలోనే అత్యంత తక్కువ వేతనం పొందే దేశాధినేతల్లో ఒకరిగా నిలబెడుతుంది. 2022లో చైనా మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జిన్‌పింగ్ ప్రాథమిక వేతనం నెలకు 11,385 యువాన్లు (సుమారు 1,830 డాలర్లు) మాత్రమే. దీనిని ఏడాది ప్రాతిపదికన చూస్తే కేవలం 22,000 డాలర్లు (సుమారు రూ.18 లక్షలకు పైమాటే). అమెరికా అధ్యక్షుడికి ఏటా లభించే 4,00,000 డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం.
వందల కోట్ల ఆస్తులు.. విదేశీ రిపోర్టుల కథనం
అధికారికంగా జీతం తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ, చైనా ప్రభుత్వం ఆయన నివాసం, ప్రయాణాలు, రోజువారీ ఖర్చులన్నింటినీ పూర్తిగా భరిస్తుంది. అంతర్జాతీయ నిఘా వర్గాలు, ప్రముఖ మీడియా సంస్థల అంచనాల ప్రకారం ఆయన కుటుంబానికి అపారమైన సంపద ఉందనే కథనాలు ఉన్నాయి. ఆయన భార్య పెంగ్ లియువాన్, కుమార్తె షీ మింగ్జే పేరు మీద ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్, వ్యాపార పెట్టుబడుల రూపంలో 700 మిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో వేల కోట్లు) వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారిక రికార్డుల్లో లేని రహస్యాలు
చైనా కమ్యూనిస్ట్ పార్టీ రికార్డుల్లో అగ్రనేతల ఆస్తులను బహిరంగంగా ప్రదర్శించరు. అధికారికంగా తక్కువ జీతం మాత్రమే వెల్లడించినప్పటికీ, ప్రభుత్వ పరంగా లభించే లగ్జరీ రాయితీలు, రాజప్రాసాన్ని తలపించే నివాసాలు ఆయన సొంతం. ఈ రకమైన రహస్య నిర్వహణ వల్లే జిన్‌పింగ్ అసలు నెట్‌వర్త్ ఎంత అనే అంశంపై ఎప్పుడూ అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది.