Elon Musk : మస్క్ దగ్గర ఉన్న చిల్లరతోనే చిన్న దేశాలను కొనేయొచ్చు..మరి ఆయన రేంజ్ ఏంటో అర్థమైందా?
మరి ఆయన రేంజ్ ఏంటో అర్థమైందా?
Elon Musk : టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద ప్రవాహంలా ఉప్పొంగుతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మస్క్, ఇప్పుడు చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆయన నికర ఆస్తి విలువ ఏకంగా 800 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.72 లక్షల కోట్లు. ప్రపంచ చరిత్రలో ఇంతటి భారీ ఆస్తిని సంపాదించిన మొదటి వ్యక్తిగా ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు.
మస్క్ సామ్రాజ్యంలో ప్రధానమైన స్పేస్ ఎక్స్, ఆయనకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAI విలీనం కావడంతో ఆయన సంపద ఊహించని రీతిలో పెరిగింది. ఈ విలీనానికి ముందు స్పేస్ ఎక్స్ విలువ 336 బిలియన్ డాలర్లు కాగా, xAI విలువ 122 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఒప్పందం పూర్తయ్యాక స్పేస్ ఎక్స్ విలువ ఏకంగా 542 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో మస్క్‌కు ఉన్న 43 శాతం వాటానే ఆయనను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలబెట్టింది. దీనికి తోడు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాలో ఆయనకు ఉన్న 178 బిలియన్ డాలర్ల షేర్లు ఈ రికార్డుకు మరింత ఊపునిచ్చాయి.
ప్రస్తుతం మస్క్ ఆస్తి విలువ 841 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లాలో ఆయనకున్న స్టాక్ ఆప్షన్ల విలువ మరో 124 బిలియన్ డాలర్లు. టెస్లా నిర్దేశించుకున్న వ్యాపార లక్ష్యాలను చేరుకుంటే, ఈ ఆప్షన్లు కూడా షేర్లుగా మారుతాయి. అప్పుడు మస్క్ నికర ఆస్తి 1 ట్రిలియన్ డాలర్ల మార్కును సులభంగా దాటేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా ఇలన్ మస్క్ అవతరించడం కేవలం కాలం నిర్ణయించాల్సిన విషయం మాత్రమే.
ప్రపంచంలోని టాప్-30 కుబేరుల జాబితా (బిలియన్ డాలర్లలో)
* ఎలాన్ మస్క్: 841.1
* లారీ పేజ్: 272.4
* సెర్గీ బ్రిన్: 251.3
* జెఫ్ బెజోస్: 244.3
* మార్క్ జుకర్‌బర్గ్: 229.3
* లారీ ఎల్లిసన్: 190.6
* బెర్నార్డ్ ఆర్నాల్ట్: 165.3
* జెన్సన్ హువాంగ్: 151.3
* వారెన్ బఫెట్: 149.5
* అమాన్షియో ఒర్టెగా: 148.5
* రాబ్ వాల్టన్: 146.0
* జిమ్ వాల్టన్: 143.3
* అలైస్ వాల్టన్: 134.1
* మిచెల్ డెల్: 130.0
* స్టీవ్ బాల్మర్: 129.7
* మైఖేల్ బ్లూమ్‌బర్గ్: 109.4
* కార్లోస్ స్లిమ్ హెలు: 108.0
* బిల్ గేట్స్: 105.5
* ముకేష్ అంబానీ: 103.4
* ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్: 97.3
* థామస్ పీటర్ఫీ: 85.3
* జూలియా కోచ్: 81.1
* చాంగ్‌పెంగ్ జావో: 78.8
* చార్లెస్ కోచ్: 73.7
* జోంగ్ షాన్షాన్: 70.0
* జాంగ్ యిమింగ్: 69.3
* గౌతమ్ అదానీ: 67.1
* జెఫ్ యాస్: 65.6
* జర్మన్ లారియా మోటా వెలాస్కో: 63.1
* మా హువాటెంగ్: 57.7