PF Advance : ఈపీఎఫ్ గుడ్‌న్యూస్.. ఇప్పుడు రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకోవచ్చు..ఎలాగంటే ?

ఇప్పుడు రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకోవచ్చు..ఎలాగంటే ?;

Update: 2025-06-26 03:15 GMT

PF Advance : ఈపీఎఫ్ఓ నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈపీఎఫ్ ఖాతాలో నుంచి అడ్వాన్స్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచారు. ఇప్పుడు ఆటో-సెటిల్‌మెంట్ మోడ్‌లో ఈ అడ్వాన్స్ డబ్బును తీసుకోవచ్చు. అంటే, మూడు రోజుల్లోపే ఐదు లక్షల రూపాయల వరకు పీఎఫ్ డబ్బులు అడ్వాన్స్‌గా వచ్చేస్తాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా నిన్న (జూన్ 25, 2025) ప్రకటించారు.

చాలా మంది ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓలో ఇప్పుడు ఏడు కోట్లకు పైగా అకౌంట్లు ఉన్నాయి. కోవిడ్ సమయంలో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలలో ఈపీఎఫ్ అడ్వాన్స్ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఒకటి.

ఆరోగ్యం, విద్య, పెళ్లి, ఇల్లు కట్టుకోవడం వంటి అవసరాల కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశాలను ఇదివరకు పెంచారు. 2024-25లో, ఆటో-సెటిల్‌మెంట్ ద్వారా ఈపీఎఫ్ఓ 2.34 కోట్ల అడ్వాన్స్ క్లెయిమ్‌లను పూర్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండున్నర నెలల్లో కూడా 76.52 లక్షల అడ్వాన్స్ క్లెయిమ్‌లను ఆటో-సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కరించారు.

పీఎఫ్ అడ్వాన్స్ డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

1. ముందుగా, యూఏఎన్ మెంబర్ ఇ-సేవా పోర్టల్‌లోకి (UAN Member e-Sewa Portal) మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

2. ఆన్‌లైన్ సర్వీసెస్ (Online Services) ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

3. అక్కడ 'క్లెయిమ్ (ఫామ్ 31, 19, 10సి)' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

4. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేసి, దాన్ని వెరిఫై చేయండి.

5. క్లెయిమ్ టైప్‌గా 'పీఎఫ్ అడ్వాన్స్ (ఫామ్ 31)'ను సెలక్ట్ చేసుకోవాలి.

6. మీరు డబ్బు ఎందుకు విత్‌డ్రా చేసుకుంటున్నారో కారణాన్ని ఎంచుకోవాలి (ఉదా: అనారోగ్యం, విద్య, మొదలైనవి).

7. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత, దాన్ని సబ్మిట్ (Submit) చేయండి.

8. మీరు పనిచేస్తున్న కంపెనీ తరపున అనుమతి (Approval) వచ్చే వరకు వేచి ఉండండి.

9. అనుమతి వచ్చిన మూడు-నాలుగు రోజుల్లోనే అడ్వాన్స్ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

Tags:    

Similar News