EPFO 3.0: EPFO 3.0 అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?;

Update: 2025-08-28 05:23 GMT

EPFO 3.0: ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో EPFO 3.0 అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను తీసుకురాబోతోంది. ఇది మొదట జూన్ 2025లో లాంచ్ కావాల్సి ఉన్నా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ పూర్తిగా డిజిటలైజేషన్ ఆధారంగా పనిచేస్తుంది. లక్షలాది మంది పీఎఫ్ సభ్యులకు ఇది ఒక గొప్ప ఉపశమనం. ఈ కొత్త సిస్టమ్ వల్ల పీఎఫ్ విత్‌డ్రా, క్లెయిమ్ చేయడం, అకౌంట్‌ వివరాలను సరిదిద్దుకోవడం వంటివి చాలా సులభంగా, వేగంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ కొత్త EPFO 3.0 గురించి ప్రజల మనసుల్లో కొన్ని సాధారణ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం.

పీఎఫ్ విత్‌డ్రా ఎంత సులభం అవుతుంది?

EPFO 3.0 ద్వారా పీఎఫ్ డబ్బులను ATM కార్డు లేదా UPI ద్వారా వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ లావాదేవీల మాదిరిగానే పనిచేస్తుంది. ఇప్పుడున్నట్లుగా క్లెయిమ్ కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.

ATM, UPIతో డబ్బులు ఎలా విత్‌డ్రా చేయాలి?

మీకు ఒక పీఎఫ్ ఏటీఎం లాంటి కార్డు లభిస్తుంది. ఇది మీ ఖాతాకు అనుసంధానించబడి ఉంటుంది. అదేవిధంగా, యూపీఐ ద్వారా కూడా మనం ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌లతో డబ్బులు పంపించినట్లు పీఎఫ్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

విత్‌డ్రాల్ లిమిట్ ఎంత?

ఈ తక్షణ విత్‌డ్రాల్‌కు పరిమితి ఉంటుంది. పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50% వరకు వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చని అంచనా. దీనివల్ల పొదుపు మొత్తం పూర్తిగా ఖర్చు కాకుండా ఉంటుంది.

అకౌంట్ వివరాలు ఎలా సరిదిద్దుకోవాలి?

మీరు మీ పీఎఫ్ ఖాతాలో పేరు, పుట్టిన తేదీ, కేవైసీ, బ్యాంక్ వివరాలు వంటివాటిని ఓటీపీ వెరిఫికేషన్‌తో ఆన్‌లైన్‌లోనే సరిదిద్దుకోవచ్చు. దీని కోసం ఫారం నింపడం లేదా ఆఫీస్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

పీఎఫ్ క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ ఎలా?

EPFO 3.0లో దాదాపు 95% క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పరిష్కారం అవుతాయి. దీనివల్ల క్లెయిమ్ ప్రక్రియకు కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది, పారదర్శకత పెరుగుతుంది.

ఇంకా ఏయే సేవలు లభిస్తాయి?

పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, ఇన్ స్టంట్ మనీ ట్రాన్సఫర్ వంటి సేవలు లభిస్తాయి.

అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన (PMJJBY) వంటి ప్రభుత్వ పథకాలను కూడా ఇందులో అనుసంధానించే అవకాశం ఉంది. దీంతో అన్ని సేవలు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో లభిస్తాయి. ప్రతి ట్రాన్సాక్షన్, మార్పు లేదా క్లెయిమ్ ఓటీపీ లేదా పిన్ వెరిఫికేషన్‌తో జరుగుతుంది, కాబట్టి మీ ఖాతా చాలా సురక్షితంగా ఉంటుంది.

EPFO 3.0 ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ఈ ప్లాట్‌ఫారమ్ మే-జూన్ 2025లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ టెస్టింగ్ జరుగుతున్నందున కొంత ఆలస్యం అయింది. అయితే, ఇది త్వరలో పీఎఫ్ సభ్యులకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News