IT Returns : ఐటీ రిటర్న్ దాఖలు చేసినా డబ్బులు రాలేదా.. అయితే వెంటనే ఇలా చేయండి వచ్చేస్తాయి

అయితే వెంటనే ఇలా చేయండి వచ్చేస్తాయి;

Update: 2025-06-21 01:31 GMT

IT Returns : మనం ఒక సంవత్సరంలో అవసరానికి మించి ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి ఉండొచ్చు. అలాంటి టైమ్‌లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు, ఎంత ట్యాక్స్ కట్టాలి. ఎంత కట్టాం, మన ఆదాయం ఎంత - ఈ వివరాలన్నీ ఇస్తాం. ఒకవేళ మనం ఎక్కువ ట్యాక్స్ కట్టి ఉంటే, దాన్ని తిరిగి ఇవ్వమని (రీఫండ్) అడుగుతాం. అలా అడిగినా కూడా కొన్ని కారణాల వల్ల ఆ డబ్బులు తిరిగి మన అకౌంట్‌కి రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియాలో కొన్ని చిట్కాలు చెప్పింది.

ఈ రెండు పనులు చేయండి, డబ్బులు వచ్చేస్తాయి

మీ బ్యాంక్ ఖాతా సరిగ్గా లేకపోతే (వాలిడేట్ అవ్వకపోతే) లేదా రీఫండ్ మళ్ళీ పంపమని అడగకపోతేనే రీఫండ్ ఆగిపోయి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ చెప్పింది. కాబట్టి, ఈ రెండు పనులు చేయమని సూచించింది. 1. బ్యాంక్ ఖాతాను వాలిడేట్ లేదా రీ-వాలిడేట్ చేయాలి. 2. బ్యాంక్ అకౌంట్ వాలిడేట్ అయిన తర్వాత, 'రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్'ను పెట్టండి.

బ్యాంక్ ఖాతాను ఎలా సరిచూసుకోవాలి?

మీకు రీఫండ్ డబ్బులు రావాలంటే, మీ బ్యాంక్ ఖాతా ఆక్టివ్‌గా ఉండాలి. దీనికోసం మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లి లాగిన్ అవ్వాలి. అక్కడ మీ బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిగ్గా లేకపోతే, వెంటనే అప్‌డేట్ చేసి, మీ బ్యాంక్ ఖాతాను వాలిడేట్ చేయండి.

'రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్' ఎలా పెట్టాలి?

మీరు బ్యాంక్ ఖాతాను వాలిడేట్ చేసిన తర్వాత కూడా, ఒకవేళ 'రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్' పెట్టడం మర్చిపోతే, డబ్బులు రావు. అలా మర్చిపోయి ఉంటే, ఈ కింద చెప్పినట్లుగా వెంటనే ఆ పని చేయండి

ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.

1. 'సర్వీసెస్' దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత 'రీఫండ్ రీ-ఇష్యూ'ని సెలెక్ట్ చేసుకోండి.

2. 'రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్' కోసం కావాల్సిన డాక్యుమెంట్‌ను (పత్రాన్ని) సెలెక్ట్ చేసుకోండి.

3. మీరు వాలిడేట్ చేసిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.

4. 'ప్రొసీడ్ టు వెరిఫికేషన్' పై క్లిక్ చేయండి.

5. ఆధార్ ఓటీపీ / ఈవీసీ / డీఎస్‌సీ (డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్) - ఈ మూడింటిలో ఒక వెరిఫికేషన్ విధానాన్ని ఎంచుకోండి.

6. ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక దాని ద్వారా మీరు మీ రిక్వెస్ట్‌ను వెరిఫై చేసి సబ్మిట్ చేయొచ్చు.

7. ఇలాంటి పనులన్నీ సక్సెస్‌ఫుల్‌గా చేసి సబ్మిట్ చేసిన తర్వాత, ఒకటి-రెండు నెలల్లో మీకు రీఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News