Flipkart : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ 2025 వచ్చేస్తోంది.. అమెజాన్‌కు పోటీగా భారీ ఆఫర్లు!

అమెజాన్‌కు పోటీగా భారీ ఆఫర్లు!;

Update: 2025-07-08 12:47 GMT

Flipkart : అమెజాన్ ప్రైమ్ డే సేల్ త్వరలో రాబోతోంది కాబట్టి ఫ్లిప్‌కార్ట్ కూడా కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ 2025తో రాబోతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ జూలై 12 నుండి మొదలై 6 రోజుల పాటు అంటే జూలై 17 వరకు ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు కూడా జూలై 12 నుంచే సేల్ మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌ల కోసం ఈ సేల్ 24 గంటల ముందుగానే ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ కోసం యాక్సిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐడిఎఫ్‌సి బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. సేల్ సమయంలో ఎక్కువ ఆదా చేయాలనుకుంటే వేల కొద్దీ ఉత్పత్తులపై డిస్కౌంట్‌లతో పాటు ఈ బ్యాంక్ కార్డు ఆఫర్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో సేల్ సమయంలో లభించే కొన్ని అద్భుతమైన డీల్స్ గురించి చెప్పింది. ఈ సేల్‌లో గెలాక్సీ S24, మొబైల్‌ను డిస్కౌంట్ తర్వాత రూ.50,000 లోపు ధరకే అమ్ముతారు. దీనితో పాటు సేల్ సమయంలో హెచ్‌పి ల్యాప్‌టాప్‌లు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి.

https://x.com/Flipkart/status/1941037270439743562?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1941037270439743562|twgr^45903b366f6d12fd70d0c77dc7af7a2b71c3ae3d|twcon^s1_&ref_url=https://www.tv9hindi.com/technology/flipkart-goat-sale-2025-get-bumper-discounts-on-new-smartphones-smart-tv-3379400.html

వేల కొద్దీ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్‌లతో పాటు, మీరు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మాత్రమే కాకుండా, హోమ్ అప్లయెన్సెస్ అంటే టీవీలు, ఏసీలు వంటివి కూడా తక్కువ ధరకే లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లభించే డీల్స్ వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు. కానీ మరోవైపు అమెజాన్ ఇప్పటికే తమ ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ సేల్ కోసం ఐసిఐసిఐ, ఎస్‌బిఐ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే, సేల్ సమయంలో ఈ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి షాపింగ్ చేస్తే 10 శాతం ఆదా చేసుకునే మంచి అవకాశం లభిస్తుంది.

Tags:    

Similar News