Fuel Prices : చమురు దిగుమతుల కోసం భారత్ కొత్త ప్లాన్..నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
Fuel Prices : పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. అయితే భారత్ తెలివిగా వ్యవహరించి రష్యా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ముడి చమురును సేకరించడం ప్రారంభించింది. మధ్యప్రాచ్యం వెలుపల నుంచి చమురును దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నప్పటికీ, దేశంలో ఇంధన కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
గ్యాస్ సిలిండర్ ధరల మోత
మార్చి నెల ప్రారంభం నుంచే గ్యాస్ ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 60 రూపాయల వరకు పెరిగింది. ఇక వ్యాపార అవసరాల కోసం వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 144 రూపాయల మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965 ఉండగా, కమర్షియల్ సిలిండర్ రూ.2105.50 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ రూ.913 కాగా, పాట్నాలో అత్యధికంగా రూ.1002.50 పలుకుతోంది.
స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లు దాటినప్పటికీ, నేడు (మార్చి 19, ఆదివారం) భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నా, దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను మార్చలేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.107.50 ఉండగా, డీజిల్ రూ.95.70 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.94.77, ముంబైలో రూ.103.54గా ఉంది. యుద్ధం గనుక ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నగరాల వారీగా ఇంధన ధరల పరిస్థితి
ప్రస్తుతం కోల్‌కతాలో పెట్రోల్ లీటర్ రూ.105.45, డీజిల్ రూ.92.02 వద్ద ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ.102.99గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పెట్రోల్ రూ.94.84 కాగా, గుర్గావ్‌లో రూ.95.85 వద్ద లభిస్తోంది. గ్యాస్ విషయానికి వస్తే ముంబైలో రూ.912.50, కోల్‌కతాలో రూ.939, చెన్నైలో రూ.928.50 చొప్పున డొమెస్టిక్ సిలిండర్ ధరలు ఉన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు దెబ్బతింటే మాత్రం వచ్చే నెలలో ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం ప్రజలు ఆందోళన చెందకుండా పానిక్ బయింగ్ చేయవద్దని కోరుతోంది.