Gold Price : ఒక్క సారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే

కారణం ఇదే;

Update: 2025-07-16 04:39 GMT

Gold Price : బంగారం, వెండి ధరలు రోజురోజుకు మారుతుంటాయన్న సంగతి తెలిసిందే. సోమవారం భారీ పెరుగుదల తర్వాత బంగారం, వెండి మార్కెట్లలో ఒక్కసారిగా తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం కార్డు స్థాయిని తాకిన వెండి ధరలు, మంగళవారం భారీగా పడిపోయాయి. ఈ అనూహ్య హెచ్చుతగ్గులు మార్కెట్‌లో పెట్టుబడిదారుల ఆందోళనను పెంచాయి. ఈ భారీ మార్పులకు గల కారణాలను తెలుసకుందాం. మంగళవారం నాటి మార్కెట్ గణాంకాల ప్రకారం బంగారం, వెండి రెండింటిలోనూ గణనీయమైన పతనాన్ని సూచిస్తున్నాయి.

ఒక రోజు క్రితం రికార్డు గరిష్ట స్థాయి (కిలోకు రూ.1,15,000) ని తాకిన వెండి ధర, మంగళవారం ఏకంగా రూ.3,000 పడిపోయి కిలోకు రూ.1,12,000కి చేరింది. ఈ భారీ తగ్గుదల, గత రెండు రోజులలో వెండి ధరలో వచ్చిన రూ.9,500 పెరుగుదలకు భిన్నంగా ఉంది. వెండితో పాటు బంగారం ధరలు కూడా తగ్గాయి. 99.9% స్వచ్ఛత గల బంగారం ధర రూ.200 తగ్గి 10 గ్రాములకు రూ.99,370కి చేరుకుంది. అదేవిధంగా, 99.5% స్వచ్ఛత గల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.98,800 వద్ద ముగిసింది.

ధరల పతనానికి నిపుణులు కొన్ని ముఖ్య కారణాలను విశ్లేషించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికన్ డాలర్ సూచికలో వచ్చిన పెరుగుదల కారణంగా బంగారం , వెండి ధరలు తమ గరిష్ట స్థాయి నుంచి పడిపోయాయి. బలమైన డాలర్ సాధారణంగా బంగారం ధరలను తగ్గిస్తుంది. మార్కెట్‌లో ఇటీవల వచ్చిన భారీ పెరుగుదల కారణంగా, పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించేందుకు మొగ్గు చూపారు. ముఖ్యంగా, త్వరలో విడుదల కానున్న కీలకమైన అమెరికన్ ద్రవ్యోల్బణ గణాంకాలకు ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడం కూడా ధరలు తగ్గడానికి ఒక కారణం.

భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, బంగారం ధరలు ఒక పరిమిత పరిధిలోనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల ప్రకటనలు సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్‌ను పెంచినా, చర్చల ఆశలు భారీ పెరుగుదలను అడ్డుకున్నాయి.

నిన్నటి భారీ పతనం తర్వాత, బుధవారం మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ ఇండెక్స్‌ను బట్టి చూస్తే, బంగారం వెండి ధరలు స్థిరంగా ఉండకపోవచ్చు. అయితే, నిన్న భారీగా తగ్గిన ధరలు నేడు స్వల్పంగా కోలుకునే అవకాశం ఉంది. నేడు వెండి ధర కిలోకు రూ.1,12,000 - రూ.1,13,000 మధ్య ఉండవచ్చు. అదేవిధంగా, బంగారం ధరలు 10 గ్రాములకు రూ.99,300 - రూ.99,500 మధ్య కదలాడవచ్చు.

Tags:    

Similar News