IRFC : లాభాల్లో రికార్డ్ క్రియేట్ చేసిన రైల్వే సంస్థ

కార్డ్ క్రియేట్ చేసిన రైల్వే సంస్థ;

Update: 2025-07-23 03:51 GMT

IRFC : భారతీయ రైల్వేకు చెందిన ఆర్థిక విభాగమైన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్-జూన్ 2025) అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ రూ.1,746 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 11శాతం ఎక్కువ. మంచి ఆదాయం, మెరుగైన నికర వడ్డీ మార్జిన్ (NIM) వల్ల ఈ లాభం వచ్చింది. IRFC NIM 1.53శాతానికి చేరింది. ఇది గత మూడేళ్లలో అత్యధికం. IRFC జూన్ 2025 త్రైమాసికంలో రూ.1,746 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వచ్చిన రూ.1,577 కోట్ల కంటే 11% ఎక్కువ. రైల్వే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల డిమాండ్ పెరగడం, బలమైన ఆర్థిక ప్రణాళికలు ఈ విజయానికి కారణం.

IRFC మొత్తం ఆదాయం ఈ త్రైమాసికంలో రూ.6,918 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.6,766 కోట్లు ఉండేది. ఖర్చులు మాత్రం కొద్దిగా తగ్గాయి. ఈసారి రూ.5,173 కోట్లు కాగా, గత ఏడాది రూ.5,189 కోట్లు ఉండేది. ఖర్చులను అదుపులో ఉంచడం వల్ల IRFC ఆర్థికంగా మరింత బలంగా మారింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) పెరగడం కూడా కంపెనీ ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించింది.

IRFC నికర వడ్డీ మార్జిన్ (NIM) ఈ త్రైమాసికంలో 1.53శాతానికి చేరుకుంది, ఇది గత మూడేళ్లలో అత్యధికం. మంచి వడ్డీ స్ప్రెడ్, ఖర్చుల నిర్వహణ వల్ల ఇది సాధ్యమైంది. IRFC రైల్వేకు తక్కువ ఖర్చుతో నిధులు సమకూర్చడమే కాకుండా, తన ఆర్థిక పనితీరును కూడా నిరంతరం మెరుగుపరుచుకుంటోందని ఇది స్పష్టం చేస్తుంది.

కంపెనీ షేర్ విలువ (బుక్ వాల్యూ) రూ.1.65గా ఉంది, ఇది దాని బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది. అంతేకాకుండా, IRFC నెట్‌వర్త్ రూ.4,423.96 కోట్లకు చేరుకుంది.. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం. ఇది IRFC దీర్ఘకాలిక స్థిరత్వం, రైల్వేకు ఆర్థిక సహాయం అందించే కెపాసిటీ తెలియజేస్తుంది. మంగళవారం IRFC షేర్లు 2.73శాతం తగ్గి రూ.130.70 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు స్టాక్ 13.07శాతం తగ్గింది, గత ఒక సంవత్సరంలో 36.11శాతం తగ్గింది. అయినప్పటికీ, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.71 లక్షల కోట్లుగా ఉంది.

Tags:    

Similar News