Hormuz Strait Crisis : హోర్ముజ్ సంక్షోభం దెబ్బకు పెరగనున్న బ్రాండెడ్ బట్టల ధరలు.. ఫ్యాషన్ రంగానికి ఆయిల్ సెగ

ఫ్యాషన్ రంగానికి ఆయిల్ సెగ

Update: 2026-07-21 04:54 GMT

Hormuz Strait Crisis : మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న యుద్ధ వాతావరణం కేవలం క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ధరలపైనే కాకుండా ఫ్యాషన్ రంగాన్ని కూడా తీవ్రంగా కుదిపేస్తోంది. మన వార్డ్‌రోబ్‌లో ఉండే ఫ్లీస్ జాకెట్లు, లెగ్గింగ్స్, స్పోర్ట్స్ షూస్ వంటి బ్రాండెడ్ దుస్తులు రూపుదిద్దుకునేది ఈ క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే బై-ప్రొడక్ట్స్ ద్వారానే. ఆయిల్ సప్లై దెబ్బతినడంతో పాస్తా, పాలియేస్టర్, నైలాన్, స్పాండెక్స్ వంటి సింథటిక్ ఫైబర్ల కొరత ఏర్పడి, రాబోయే రోజుల్లో బ్రాండెడ్ దుస్తుల ధరలు రెక్కలు విప్పే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

చైనా పెట్రోకెమికల్ కంపెనీలపై విపరీతమైన ప్రభావం

ఈ సంక్షోభం చైనాలోని అతిపెద్ద సింథటిక్ ఫైబర్ తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. టోంగ్‌కున్ వంటి పాలియేస్టర్ దిగ్గజాలు ముడిసరుకు నిల్వల కారణంగా తాత్కాలికంగా లాభపడినప్పటికీ, హెంగ్లీ వంటి పెట్రోకెమికల్ సంస్థల షేర్లు మూడోవంతుకు పైగా పడిపోయాయి. సప్లై చైన్ దెబ్బతినడంతో చైనాలో సింథటిక్ ఫైబర్ ఉత్పత్తి 11 శాతం మేర పడిపోయి, గత రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. దీనివల్ల Shein, Temu వంటి ప్రముఖ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ల సరసమైన దుస్తుల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.

రీసైకిల్డ్ ప్లాస్టిక్ వాడే బ్రాండ్లకు ఊరట

ఆయిల్ సంక్షోభం ఎంత పెరిగినా.. ముందస్తుగా పర్యావరణ పరిరక్షణ (ESG) విధానాలు పాటించిన కొన్ని కంపెనీలు సురక్షితంగా ఉన్నాయి. Zara మాతృ సంస్థ Inditex SA మరియు H&M బ్రాండ్లు తమ పాలియేస్టర్ అవసరాల కోసం ఎక్కువగా రీసైకిల్డ్ ప్లాస్టిక్‎ను ఉపయోగిస్తున్నాయి. అయితే Uniqlo వంటి బ్రాండ్లు తమ ఫంక్షనల్ ఫ్యాబ్రిక్స్ కోసం సింథటిక్ ఆయిల్‌పైనే ఆధారపడటంతో అవి ముడిసరుకు కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కాటన్ పంటకూ ఎరువుల ముప్పు

సింథటిక్ కాకుండా కాటన్ (ప్రకృతి సిద్ధమైన పత్తి) వైపు మళ్లుదామన్నా అక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు అయిన భారతదేశం.. ఎరువులు (యూరియా, సహజ వాయువు) తయారీకి గల్ఫ్ దేశాలపైనే ఆధారపడి ఉంది. గల్ఫ్ లో సంక్షోభం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో కాటన్ ధరలు రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరగా, పత్తి నిల్వలు దశాబ్ద కాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ ప్రభావం 2028 నాటికి కస్టమర్ల జేబులపై స్పష్టంగా పడనుంది.

Tags:    

Similar News