Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్‌లో సరికొత్త సంచలనం.. ఈ ఫండ్‎తో కోటీశ్వరులు కావడం ఖాయం

ఈ ఫండ్‎తో కోటీశ్వరులు కావడం ఖాయం

Update: 2026-05-19 14:16 GMT

Mutual Funds : మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఏ షేరు కొనాలో, ఏ సెక్టార్‌లో పెట్టుబడి పెట్టాలో తెలియక సాధారణ ఇన్వెస్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా, డేటా ఆధారిత మోడల్‌తో అద్భుతమైన లాభాలను అందిస్తోంది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ సెక్టార్ ప్యాసివ్ ఎఫ్‌ఓఎఫ్. ఎమోషన్స్ లేకుండా, కేవలం మార్కెట్ ట్రెండ్స్ మరియు స్థూల ఆర్థిక సంకేతాల ఆధారంగా ఈ ఫండ్ విభిన్న రంగాల ఈటీఎఫ్‎లలో పెట్టుబడులను మారుస్తూ (సెక్టార్ రొటేషన్) ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్ అందిస్తోంది.

సెక్టార్ రొటేషన్ తో అదిరిపోయే ప్లాన్

ఈ ఫండ్ తాజా పోర్ట్‌ఫోలియో వ్యూహాన్ని గమనిస్తే, దీని క్రమశిక్షణ ఎలాంటిదో స్పష్టంగా అర్థమవుతుంది. డిసెంబర్ 2025, ఏప్రిల్ 2026 మధ్య కాలంలో మెటల్ రంగంలో బలమైన లాభాలు రావడంతో, ఈ ఫండ్ అందులోని తన పెట్టుబడులను 10 శాతం నుంచి 6.59 శాతానికి తగ్గించుకుంది. అదే సమయంలో రిస్క్-బెనిఫిట్ రేషియో బాగున్న ప్రైవేట్ బ్యాంకింగ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్‌ను 19 శాతం నుంచి ఏకంగా 26.68 శాతానికి పెంచేసింది. అంతేకాదు, అంతకుముందు సున్నాగా ఉన్న పవర్ (విద్యుత్) రంగంలో 8.39 శాతం, ఫార్మా రంగంలో 9.56 శాతం పెట్టుబడులను కొత్తగా జోడించింది. ప్రస్తుతం ఈ పోర్ట్‌ఫోలియోలో ప్రైవేట్ బ్యాంకులు (26.68%), ఎఫ్‌ఎంసీజీ (10.55%), ఫార్మా (9.56%), ఆయిల్ అండ్ గ్యాస్ (9.40%), ఐటీ (8.58%) రంగాలు ప్రధాన వాటాలుగా ఉన్నాయి.

ఖర్చులు తక్కువ.. లాభాలు ఎక్కువ

ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను దిగ్గజ ఫండ్ మేనేజర్లు శంకరిన్ నరేన్, ధర్మేష్ కక్కడ్ 2018 నుంచి అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 30, 2026 నాటికి వార్షికంగా 13.35% CAGR రేటుతో స్థిరమైన రిటర్న్స్ ఇచ్చింది. ఇది బెంచ్‌మార్క్ ఇండెక్స్ అయిన నిఫ్టీ-500 టిఆర్ఐ (12.91%) కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. ఈ ఫండ్ ద్వారా ఇన్వెస్టర్లకు డీమ్యాట్ అకౌంట్, బ్రోకరేజ్ ఖర్చులు, విడివిడిగా ఈటీఎఫ్‌లు కొనే తలనొప్పులు తప్పుతాయి. దీని ఎక్స్‌పెన్స్ రేషియో కేవలం 0.60% మాత్రమే కాగా, 15 రోజుల్లోపు డబ్బులు విత్ డ్రా చేసుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది. మార్కెట్లో ఏ సెక్టార్ దూసుకుపోతుందో ముందే ఊహించలేని రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ప్యాసివ్ ఫండ్ ఒక బెస్ట్ ఆప్షన్.

Tags:    

Similar News