జపాన్ దేశాన్ని అధిగమించిన భారత ఆర్థికవ్యవస్థ

India's economy is competing with the top countries

Update: 2025-05-25 06:04 GMT

భారతదేశ ఆర్థీక వ్యవస్థ అగ్రదేశాలతో పోటీపడుతోంది. తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ వృద్ధి సాధించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటన విడుదల చేశారు. భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు.

దీంతో భారతదేశం అధికారికంగా జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలో ప్రథమ స్థానంలో అమెరికా ఉండగా ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది. మూడవ స్థానంలో జర్మనీ ఉంది. 2027 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థను కూడా దాటిపోతుందని ఆర్థిక నిపుణుల అంచనా. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో రాకెట్ వేగంతో ముందుకు సాగుతుందంటున్నారు.

Tags:    

Similar News