Aadhaar: బ్యాంకుకు వెళ్లే పనిలేదు..కేవలం ఆధార్‌తో చిటికెలో మీ అకౌంట్లోకి రూ.2000
కేవలం ఆధార్‌తో చిటికెలో మీ అకౌంట్లోకి రూ.2000
Aadhaar: చాలా మందికి అత్యవసరంగా ఒకటి రెండు వేల రూపాయలు అవసరమవుతుంటాయి. ఇలాంటి చిన్న మొత్తాల కోసం ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అనేక బ్యాంకింగ్ యాప్స్ మరియు గుర్తింపు పొందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు కేవలం మీ ఆధార్ కార్డు ఆధారంగా నిమిషాల్లో లోన్ మంజూరు చేస్తున్నాయి. అయితే, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లోన్ ఇచ్చే సంస్థ ఆర్‌బీఐ గుర్తింపు పొంది ఉండాలి.
ప్లే స్టోర్‌లో వేల సంఖ్యలో లోన్ యాప్స్ ఉంటాయి. కానీ మీరు కేవలం పేరున్న బ్యాంకులు లేదా రిజిస్టర్డ్ ఎన్‌బీఎఫ్‌సీ యాప్స్‌ను మాత్రమే వాడాలి. అపరిచిత వ్యక్తులు పంపే వాట్సాప్ లింకులు లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లోన్ ఆఫర్లపై క్లిక్ చేయకండి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. లోన్ ఇచ్చే సంస్థ వివరాలు, వడ్డీ రేట్లు, కంప్లైంట్ చేసే విధానం అన్నీ స్పష్టంగా ఉండాలి.
ఆధార్ బేస్డ్ లోన్ కోసం మీకు పెద్దగా పేపర్లు అవసరం లేదు. మీ దగ్గర ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ ఉండాలి. మీ ఆధార్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. దీనితో మీ గుర్తింపు సులభంగా వెరిఫై అవుతుంది.
లోన్ అప్లై చేసేటప్పుడు మీ పాన్ కార్డు, ఆధార్ నంబర్ అడుగుతారు. కొన్ని యాప్స్ వీడియో కేవైసీ కూడా చేస్తాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే.. ఓటీపీని యాప్ స్క్రీన్ మీద మాత్రమే ఎంటర్ చేయండి. ఫోన్ కాల్‌లో ఎవరైనా మేము లోన్ ఇప్పిస్తాం.. ఓటీపీ చెప్పండి అంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఓటీపీ అనేది మీ పాస్‌వర్డ్ లాంటిదని గుర్తుంచుకోండి.
రూ.2000 లోన్ కదా అని కళ్లు మూసుకుని అప్లై చేయకండి. అసలు మొత్తం కంటే వడ్డీ ఎంత? ప్రాసెసింగ్ ఫీజు ఎంత? ప్లాట్‌ఫారమ్ ఫీజు పేరుతో ఎంత కట్ చేస్తున్నారు? అన్నది చెక్ చేయండి. ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం.. కస్టమర్‌కు అన్ని ఖర్చులు కలిపి ఎంత అవుతుందో ముందే చెప్పాలి. లేట్ ఫీజులు ఎంత ఉంటాయో కూడా తెలుసుకోండి.
తీసుకున్న చిన్న లోన్ మొత్తాన్ని కచ్చితంగా గడువులోగా చెల్లించండి. ఒకవేళ మీరు చెల్లించడం ఆలస్యం చేస్తే పెనాల్టీలు భారంగా మారుతాయి. అంతేకాకుండా, మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. ఒకసారి స్కోర్ తగ్గితే భవిష్యత్తులో హోమ్ లోన్ లేదా కార్ లోన్ పొందడం కష్టమవుతుంది. అందుకే రిమైండర్లు పెట్టుకుని మరీ లోన్ క్లియర్ చేయండి.