ITR Filing  : ఫైలింగ్ ఒక్కటే సరిపోదు.. 30 రోజుల్లోగా ఈ పని చేయకపోతే ఐటీఆర్ రీజెక్ట్ కావడం ఖాయం

ఐటీఆర్ రీజెక్ట్ కావడం ఖాయం

Update: 2026-07-31 10:51 GMT

ITR Filing  : మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసి ఈ-వెరిఫై చేసుకున్నారా? ఒకవేళ ఇంకా చేయకపోతే ఈరోజే అంటే జూలై 31 ఆఖరి తేదీ కావడం వల్ల వెంటనే సబ్మిట్ చేయడం ఎంతో ముఖ్యం. చివరి నిమిషంలో ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌పై విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంది. అయితే కేవలం ఐటీఆర్ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం లేదా సబ్మిట్ చేయడం మాత్రమే పూర్తి పని కాదని పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాలి. ఐటీ నిబంధనల ప్రకారం మీరు సమర్పించిన రిటర్న్ చెల్లుబాటు కావాలంటే దానికి ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడం తప్పనిసరి.

పన్ను చెల్లింపుదారులకు ఒక మంచి ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. ఈరోజు జూలై 31న ఐటీఆర్ దాఖలు చేసిన వారు వెంటనే అదే క్షణంలో ఈ-వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. చట్టం ప్రకారం, ఒక పన్ను చెల్లింపుదారు జూలై 31న లేదా అంతకంటే ముందు రిటర్న్ దాఖలు చేస్తే, అప్‌లోడ్ చేసిన తేదీ నుంచి 30 రోజుల వ్యవధిలో ఈ-వెరిఫికేషన్ పూర్తి చేస్తే చాలు. ఆ రిటర్న్ జూలై 31న దాఖలు చేసినట్లుగానే పరిగణించబడుతుంది. అంటే ఈరోజు ఐటీఆర్ దాఖలు చేసే వారు ఆగస్టు నెలలో కూడా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.

ఒకవేళ మీరు ఐటీఆర్ అప్‌లోడ్ చేసిన తర్వాత నిర్ణీత 30 రోజుల వ్యవధి దాటి వెరిఫికేషన్ పూర్తి చేస్తే, మీరు ఏ రోజైతే వెరిఫై చేస్తారో ఆ తేదీనే ఐటీఆర్ దాఖలు చేసిన తేదీగా పరిగణిస్తారు. దీనివల్ల మీరు జూలై 31 లోపు ఫైల్ చేసినప్పటికీ, మీ రిటర్న్ సమయం దాటిన తర్వాత సమర్పించిన బిలేటెడ్ రిటర్న్‎గా మారిపోతుంది. ఒకవేళ డిసెంబర్ 31, 2026 నాటికి కూడా ఈ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే, ఆదాయపు పన్ను శాఖ ఏదైనా ప్రత్యేక సడలింపు ఇస్తే తప్ప మీ ఐటీఆర్ పూర్తిగా అస్పష్టంగా మారి, చెల్లకుండా పోతుంది.

ఈ-వెరిఫికేషన్ ఎలా చేయాలి?

పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ లేదా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో ఈ-వెరిఫికేషన్‌ పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ వెసులుబాటు లేని వారు సంతకం చేసిన ఐటీఆర్-వి కాపీని బెంగళూరులోని సిపిసి కేంద్రానికి తపాళా ద్వారా పంపాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం 30 రోజుల సమయం ఉన్నప్పటికీ, మీ రిటర్న్స్ వేగంగా ప్రాసెస్ కావడానికి, ఆలస్యమైన రిటర్న్‌గా మారకుండా ఉండేందుకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ-వెరిఫికేషన్ ప్రక్రియను ముగించడం శ్రేయస్కరం. మరిన్ని వివరాల కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్ https://www.incometax.gov.in/ సమర్పించవచ్చు.

Tags:    

Similar News