JIO IPO : ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. 44 లక్షల మందికి షాక్!

44 లక్షల మందికి షాక్!

Update: 2025-09-01 12:05 GMT

JIO IPO : దేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ, తమ టెలికాం, డిజిటల్ సర్వీసుల కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ త్వరలో ఐపీఓ తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ ఐపీఓ 2026 ఫస్ట్ హాఫ్ లో రావచ్చు. దీని ద్వారా జియో రూ. 13.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీగా మారే అవకాశం ఉంది. అయితే, ఈ వార్తతో ఆర్‌ఐఎల్ షేర్ హోల్డర్లలో ఒక పెద్ద సందేహం మొదలైంది. వారికి జియో షేర్లు ఉచితంగా లభిస్తాయా లేదా అనేది వారి ప్రశ్న. 2023లో ఆర్‌ఐఎల్ తన ఆర్థిక విభాగం అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను వేరు చేసినప్పుడు, ఆర్‌ఐఎల్ షేర్ హోల్డర్లకు ఒక్కో షేర్‌కు ఒక షేర్ ఉచితంగా లభించింది.

ఈసారి జియో విషయంలో ముఖేష్ అంబానీ ఐపీఓ మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే, షేర్ హోల్డర్లకు జియో షేర్లు ఉచితంగా లభించవు. ఒకవేళ వారికి జియోలో వాటా కావాలంటే, ఐపీఓలో డబ్బులు పెట్టి షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఆర్‌ఐఎల్ షేర్ హోల్డర్లకు నేరుగా షేర్లు లభించనప్పటికీ, జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఆర్‌ఐఎల్ కి 66.3% వాటా ఉంటుంది. కాబట్టి జియో లాభం చివరికి ఆర్‌ఐఎల్‌కు చేరుకుంటుంది, దీనివల్ల షేర్ హోల్డర్లకు పరోక్షంగా లాభం దక్కే అవకాశం ఉంది.

ఈటీ నివేదిక ప్రకారం, బ్రోకరేజ్ సంస్థలైన యాంటిక్, జెఫరీస్, గోల్డ్‌మన్ శాక్స్, జియో బలమైన ఆర్థిక ప్రదర్శన, కస్టమర్ల పెరుగుదల, టారిఫ్‌లలో పెరుగుదల ఆర్‌ఐఎల్‌కు దీర్ఘకాలిక లాభాలను తెస్తాయని భావిస్తున్నాయి. ఒకవేళ జియోలో 5% వాటాను మాత్రమే విక్రయించినా, ఈ ఐపీఓ ద్వారా రూ. 58,000-67,500 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ అవుతుంది. గతంలో హ్యుండాయ్ మోటార్ ఇండియా (2024) రూ. 27,870 కోట్ల ఐపీఓతో రికార్డు సృష్టించింది.

ఏజీఎంలో అంబానీ జియో కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన టెక్నాలజీ, సర్వీసులను విస్తరించాలని చూస్తున్నట్లు సూచనలు ఇచ్చారు. అంటే, జియోకు అంతర్జాతీయ విస్తరణ, ప్రీమియం వాల్యుయేషన్ అవకాశాలు కూడా పెరుగుతాయి.

Tags:    

Similar News