Kavya Maran vs Anirudh: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అయిన అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ యజమాని కావ్య మారన్ వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ అనూహ్యమైన వార్త బయటకు వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అందరిలోనూ ఒకే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతోంది. అదేంటంటే.. ఈ ఇద్దరిలో అసలు ఎవరు ఎక్కువ ధనవంతులు? కావ్య మారన్ ఆస్తులు ఎంత? అనిరుధ్ సంపాదన ఎంత అనే వివరాలపై అందరూ ఆరా తీస్తున్నారు. కేవలం మ్యూజిక్ డైరెక్టరే కాకుండా అనిరుధ్ మంచి వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు.

కావ్య మారన్ కుటుంబ నేపథ్యం అలాగే సంపద

కావ్య మారన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె తండ్రి కళానిధి మారన్ సన్ టీవీ నెట్‌వర్క్ అధినేతగా ఉండటంతో పాటు దేశంలోని అగ్రశ్రేణి బిలియనీర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బాధ్యతలను కావ్య మారన్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కళానిధి మారన్ మొత్తం నికర విలువ సుమారు 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తుల విషయానికి వస్తే.. అధికారిక లెక్కలు స్పష్టంగా లేనప్పటికీ మీడియా నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆమె కుటుంబ వ్యాపారాల విలువను బట్టి చూస్తే ఈ మొత్తం ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

అనిరుధ్ రవిచందర్ సంపాదన

షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అనిరుధ్ రవిచందర్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సంగీత దర్శకులలో ఒకరిగా ఉన్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకునే ఆయన, పెద్ద పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ల కోసం ఏకంగా రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం అనిరుధ్ రవిచందర్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఆయన పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే కాదు

అనిరుధ్ కేవలం సినిమాలకు పాటలు అందించడానికే పరిమితం కాకుండా పలు వ్యాపార రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టారు. ఫిల్టర్ కాఫీ స్టార్టప్ కంపెనీ అయిన వీఎస్ మణి అండ్ కంపెనీలో ఆయన కో-ఫౌండర్ అలాగే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా లోకా లోకా అనే ప్రసిద్ధ టకీలా బ్రాండ్‌కు కూడా ఆయన కో-మేకర్‌గా ఉన్నారు. ఈ వ్యాపారాల ద్వారా ఆయన సంపాదన మరింత పెరుగుతోంది. వీటన్నింటిని బేరీజు వేసి చూస్తే కావ్య మారన్ కుటుంబ సంపదతో పోలిస్తే అనిరుధ్ ఆస్తులు తక్కువే అయినప్పటికీ, తన సొంత టాలెంటుతో ఆయన అత్యంత ధనవంతులైన సంగీత దర్శకుల జాబితాలో నిలిచారు.

Tags: