Aadhaar Card : మీ పిల్లల ఆధార్ అప్‌డేట్ చేశారా లేకపోతే డీయాక్టివేట్ అయిపోతుంది.. కొత్త రూల్స్ వచ్చేశాయ్
కొత్త రూల్స్ వచ్చేశాయ్;
Aadhaar Card : యూఐడీఏఐ పిల్లల ఆధార్ కార్డు నిబంధనలలో పెద్ద మార్పులు చేసింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఆధార్ కార్డు పొందిన పిల్లలు, వారికి 7 సంవత్సరాలు నిండిన తర్వాత తమ బయోమెట్రిక్స్ ను అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. అలా చేయకపోతే, పిల్లల ఆధార్ కార్డు 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇన్ యాక్టివ్ కావచ్చని ఒక అధికారిక ప్రకటనలో తెలియజేశారు. ఉడాయ్ బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్‌డేట్ చేయడం గురించి ల్లల ఆధార్‌లో నమోదైన మొబైల్ నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్‌లు పంపడం ప్రారంభించింది.
యూఐడీఏఐ అధికారి మాట్లాడుతూ పిల్లల ఆధార్ కార్డులో ఫింగర్ ప్రింట్స్, ఐరీశ్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే, పిల్లలు ఆధార్‌తో ముడిపడి ఉన్న వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని అన్నారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆధార్ నమోదు కోసం వారి ఫింగర్ ప్రింట్స్, ఐరీశ్ బయోమెట్రిక్స్‌ను తీసుకోరు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఫోటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా గుర్తింపు పత్రాలతో మాత్రమే ఆధార్ నమోదు చేస్తారు.
పిల్లలు 5 నుండి 7 సంవత్సరాల వయస్సు మధ్య తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌ను చేసుకుంటే, అది ఉచితం. కానీ, 7 సంవత్సరాల వయస్సు తర్వాత బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి రూ.100 రుసుము చెల్లించాలి. యూఐడీఏఐ తెలిపిన వివరాల ప్రకారం.. అప్‌డేట్ చేసిన బయోమెట్రిక్‌లతో కూడిన ఆధార్ కార్డు పిల్లల జీవితాన్ని సులభతరం చేస్తుంది. పాఠశాలలో ప్రవేశం, ప్రవేశ పరీక్షలకు నమోదు, స్కాలర్‌షిప్‌లు వంటి సేవలను పొందడంలో ఆధార్‌ను ఉపయోగించుకునేలా చేస్తుంది. కాబట్టి, పిల్లల ఆధార్ కార్డును సకాలంలో అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం.